తెలంగాణ

telangana

ETV Bharat / priya

'మొఘలాయి రొయ్యల కూర' రుచి చూశారా? - etv bharat food

మొఘలాయి వంటకాల్లో ఆ హుందాతనమే వేరు. పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. ఘుమఘుమలాడే కూరలు చేయడంలో మొఘలాయిలకు సాటిలేరు. మరి ఆ నాటి మొఘలాయి స్టైల్ రొయ్యల కూర రెసిపీ ఓ సారి ట్రై చేద్దామా...

try moghalai-prawns-curry-at-home
'మొఘలాయి రొయ్యల కూర' రుచి చూశారా?

By

Published : Aug 26, 2020, 1:01 PM IST

రొయ్యల కూర రుచిగా ఉండటమే కాదు.. పోషకాలనూ అందిస్తుంది. మాంసకృత్తులు మొదలు బి6, బి12 విటమిన్లూ, ఇనుము వంటి పోషకాలు.. రొయ్యల నుంచి శరీరానికి అందుతాయి.

కావాల్సినవి

రొయ్యలు- 200 గ్రాములు, ఉల్లిపాయలు- రెండు, టొమాటోలు - రెండు, వెల్లుల్లి రేకులు - 10, అల్లం ముక్క - చిన్నది, గరంమసాలా- అరచెంచా, పసుపు - అరచెంచా, కారం - చెంచా, ధనియాలు - చెంచా, నెయ్యి - రెండు చెంచాలు, నీళ్లు- రెండు కప్పులు, ఉప్పు - తగినంత.

తయారీ

రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మెత్తగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, తగినంత ఉప్పూ, గరంమసాలా, కారం, పసుపు వేయాలి. పచ్చివాసన పోయాక కప్పు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కాస్త మరిగాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి మిగిలిన నీళ్లు పోసి, మూత పెట్టాలి. రొయ్యలు కూడా ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.

ఇదీ చదవండి: చేపలతో ఈజీగా చిరుతిళ్లు చేసుకుందామిలా..!

ABOUT THE AUTHOR

...view details