దోశలు వేసుకోవాలంటే ఓ రోజు ముందు బియ్యం, మినప పప్పు నానబెట్టే పని లేకుండా.. అతి తక్కువ పదార్థాలతో ఈజీగా బ్రెడ్ దోశలు వేసేయడం ఎలాగో చూసేద్దాం రండి....
కావల్సినవి
సాండ్‌విచ్ బ్రెడ్ స్లైసులు - నాలుగు, సెనగపిండి - పావు కప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, పెరుగు - కప్పు, నీళ్లు - సరిపడా, ఉప్పు - తగినంత, వంటసోడా - చిటికెడు, జీలకర్ర - అర చెంచా, నూనె - పావు కప్పు.
కమ్మగా 'బ్రెడ్‌దోశ'.. చిటికెలో తయారవ్వగా! తయారీ
మొదట బ్రెడ్ ముక్కలను పొడిలా చేసుకోవాలి. ఇందులో సెనగపిండి, బియ్యప్పిండి, పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత తగినంత ఉప్పు, చిటికెడు వంటసోడా, జీలకర్ర వేసి మరోసారి కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి దోశలు వేసుకోవాలి. రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకోవాలి. వీటిని సాంబారు, కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
ఇదీ చదవండి:'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసుకోవడం ఎంతో ఈజీ!