తెలంగాణ

telangana

ETV Bharat / priya

చల్లని వేళ కమ్మని 'థాయ్‌ రైస్‌' చేసుకుందామిలా.. - corn recipes

చినుకులు పడుతున్నప్పుడు ఉప్పూ, నిమ్మకాయ రసం పట్టించిన వేడివేడి మొక్కజొన్న పొత్తు తింటుంటే.. ఆ మజాయే వేరు కదూ! కానీ, థాయ్​లాండ్​లో మాత్రం మొక్కజొన్నలతో రెసిపీ చేసుకుని ఆస్వాదిస్తారు. మరి ఆ థాయ్ రైస్ రెసిపీ తయారీ విధానం తెలుసుకోవాలనుందా.. అయితే ఓ లుక్కేయండి.

try easy thai rice recipe with corn seeds
చల్లని వేళ కమ్మని 'థాయ్‌ రైస్‌' చేసుకుందామిలా..

By

Published : Oct 7, 2020, 2:23 PM IST

థాయ్ రైస్​ రెసిపీ చూసి చేసేద్దాం.. ఇంటిల్లిపాది చేత వాహ్వా అనిపించేద్దాం.

కావాల్సినవి..

బాస్మతీ బియ్యం - కప్పు, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉల్లికాడల తరుగు - పావుకప్పు, ఎరుపురంగు క్యాప్సికం - రెండు, నిమ్మరసం - చెంచా, మొక్కజొన్న గింజలు - అరకప్పు, సోయా సాస్‌ - ముప్పావుచెంచా, ఎండుమిర్చి గింజలు - చెంచా, రొయ్యలు - ఐదారు, ఆలివ్‌నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు -తగినంత, మిరియాలపొడి - అరచెంచా.

తయారీ

బియ్యాన్ని కడిగి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి మొక్కజొన్న గింజలూ, పొడుగ్గా తరిగిన క్యాప్సికం, వెల్లుల్లి రెబ్బలూ, ఉల్లికాడల తరుగూ వేసి వేయించుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక శుభ్రం చేసిన రొయ్యలూ, అన్నం, సోయాసాస్‌, ఎండుమిర్చి గింజలూ, తగినంత ఉప్పూ, మిరియాలపొడి.. వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

ఇదీ చదవండి: యూట్యూబ్​ చూసి... లోన్ ఇచ్చిన‌ బ్యాంకులకే కన్నం

ABOUT THE AUTHOR

...view details