ఉదయాన్నే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నప్పుడు బ్రేక్ ఫాస్ట్ ఆలస్యమైతే తెగ చిరాకొస్తూంటుంది. అందుకే, చిటికెలో తయారయ్యే ఈ బ్రెడ్ ఉప్మాపై ఓ లుక్కేయండి..
'బ్రెడ్ ఉప్మా'ఓ సారి ట్రై చేయాల్సిందే సుమా! కావల్సినవి
- బ్రెడ్ స్లైసులు - ఐదు,
- ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున,
- పచ్చిమిర్చి - రెండు,
- అల్లం తరుగు - కొద్దిగా,
- పసుపు - చిటికెడు,
- సాంబార్‌పొడి - చెంచా,
- నెయ్యి - నాలుగు చెంచాలు,
- ఉప్పు - తగినంత,
- ఆవాలు, సెనగ పప్పు - అరచెంచా చొప్పున.
తయారీ
ముందుగా బ్రెడ్ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బ్రెడ్ ముక్కల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, సెనగపప్పూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలూ, పసుపూ, సాంబార్ పొడీ, ఉప్పూ వేసి మంట తగ్గించాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.
ఇదీ చదవండి:'ఆలూ బ్రెడ్ రోల్స్' ఇలా చేసుకుంటే అదుర్స్!