ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరు విశ్రాంతి లేకుండా ఏదో పని చేస్తుంటారు. ఫలితంగా ఒత్తిడికి గురై అలసిపోతారు. అలాంటివారు ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం పొందాలంటే 'సినమన్ హాట్ చాక్లెట్' తాగాల్సిందే. దీనిని ఇంట్లో లభించే పదార్థాలతో చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఓసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
పాలు- 900 మిల్లీ లీటర్లు, దాల్చిన చెక్క- 4, చాక్లెట్- 500 గ్రాములు, క్రీమ్- 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పౌడర్-1 టీ స్పూన్.
తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్ చాక్లెట్ ఇలా చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది!
'సినమన్ హాట్ చాక్లెట్' తయారు చేయడానికి పైన చెప్పిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. ముందుగా పాలు వేడి చేసి ఓ పాత్రలో వేసుకోవాలి. అందులో బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క, చాక్లెట్ వేయాలి. ఆ తర్వాత చాక్లెట్ కరిగే వరకు తిప్పుతూ బాగా మరిగించాలి. తర్వాత ఓ గ్లాసులో ఆ ద్రావణాన్ని వేసి పైన క్రీమ్ పూయాలి. దానిపై కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి. అంతే సినమన్ హాట్ చాక్లెట్ రెడీ. చూశారుగా ఎంత సులభమో. మీరూ తయారు చేసి, మీ అభిప్రాయాలను ఈటీవీ భారత్తో పంచుకోండి.
ఇదీ చూడండి:దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి