తెలంగాణ

telangana

ETV Bharat / priya

'కదంబం' ఇలా చేసుకుంటే.. నోరూరిపోవాల్సిందే! - kadhambam recipe

గుడికి వెళ్తే పులిహోర ప్రసాదం ఇవ్వడం మామూలే. కానీ, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 'కదంబం' ప్రసాదం రుచి చూసే అవకాశం ఉంటుంది. మరి, అంతటి రుచికరమై, పోషకాలు నిండిన కదంబాన్ని ఇంట్లోనే చేసుకుంటే పోలా? ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి...

tasty-kadambam-prasadam-at-home
'కదంబం' ఇలా చేసుకుంటే.. నోరూరిపోవాల్సిందే!

By

Published : Sep 3, 2020, 1:00 PM IST

చాలా సార్లు గుడిలో ప్రసాదంగా 'కదంబం' తిని మైమరచిపోయి ఉంటాం. కానీ, ఇంట్లో ప్రయత్నిస్తే మాత్రం ఆ టేస్టు రానేరాదని వదిలేస్తాం. కానీ, ఈ సారి ఇలా చేసి చూడండి కుదరితీరుతుంది..

కావల్సినవి

బియ్యం- కప్పు, కందిపప్పు- కప్పు, చింతపండు గుజ్జు- చెంచా, బంగాళాదుంప, చిలగడదుంప, చేమదుంప, గుమ్మడికాయ, ములక్కాడ ముక్కలు - అన్నీ కలిపి మూడు కప్పులు, సాంబారు పొడి- చెంచా, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, నువ్వుల నూనె- కొద్దిగా.

తయారీ

బియ్యం, కందిపప్పును విడివిడిగా ఉడికించి తీసుకోవాలి. మరో గిన్నెలో కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలినిపొయ్యిమీద పెట్టి కాసిని నీళ్లు పోయాలి. అందులో చింతపండుగుజ్జు, సాంబారు పొడి, కరివేపాకూ, ఉప్పూ, కూరగాయముక్కలు వేయాలి. అవి కాసేపు ఉడికాక ఉడికించి పెట్టుకున్న పప్పూ, అన్నం వేసి సన్నని మంటపై ఉంచాలి. ఈ అన్నం దగ్గరకు అయ్యాక కొత్తిమీర, నువ్వులనూనె వేసి దింపేయాలి.

ఇదీ చదవండి: చిరుజల్లుల వేళ.. 'చికెన్‌ రైస్‌' తినకపోతే ఎలా..?

ABOUT THE AUTHOR

...view details