తెలంగాణ

telangana

ETV Bharat / priya

టేస్టీ 'ధన్‌శాక్‌' ఇలా చేసుకుంటే అదిరిపోద్ది! - dhanshak simple recipe

కాయగూరలు ఎక్కువగా తినాలని డాక్టర్లు పదే పదే చెప్పి అలసిపోతున్నారు. కానీ, కూరగాయలు చూస్తే మొహం చిట్లించుకుంటారు ఈ తరం పిల్లలు. అలాంటి వారికి వాటిలోని పోషకాలను వారికి తెలియకుండానే అందిచేదే 'ధన్​శాక్'​. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే ధన్​శాక్​​ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి.

tasty-dhanshak-recipe-in-telugu
టేస్టీ 'ధన్‌శాక్‌' ఇలా చేసుకుంటే అదిరిపోద్ది!

By

Published : Jul 5, 2020, 1:00 PM IST

ధన్​శాక్​లో మీకు నచ్చిన కూరగాయలు వేసుకుని.. వాటిని రుచికరంగా మార్చేయొచ్చు. మరి సింపుల్​గా ధన్​శాక్​ ఎలా చేసుకోవాలో తెలుసుకుని.. మీరూ ట్రై చేయండి!

కావలసినవి

  • బంగాళాదుంపలు- రెండు,
  • సొరకాయ ముక్కలు- 3 కప్పులు,
  • గుమ్మడికాయ ముక్కలు- కప్పు,
  • తాజా మెంతి ఆకులు- 4 టేబుల్‌స్పూన్లు,
  • చింతపండు గుజ్జు- 4 టీస్పూన్లు,
  • నెయ్యి- 2 టేబుల్‌స్పూన్లు,
  • ఉప్పు- రుచికి సరిపడా

మసాలాకోసం

  • వెల్లుల్లి రెబ్బలు- 12,
  • అల్లం - అంగుళంముక్క,
  • జీలకర్ర- ఒకటిన్నర టీస్పూన్లు,
  • దాల్చినచెక్క - 2 అంగుళాల ముక్క,
  • లవంగాలు- 8,
  • దనియాలు- టేబుల్‌ స్పూను,
  • ఎండుమిర్చి- 2,
  • పచ్చిమిర్చి- రెండు

తయారీ..

మసాలా కోసం తీసుకున్నవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. పప్పులన్నీ కడిగి నానబెట్టి విడిగా ఉడికించాలి. కూరగాయల ముక్కల్లో మెంతి ఆకులు కూడా వేసి ఉడికించాలి. గిన్నెలో నెయ్యి వేసి తరిగిన ఉల్లిపాయలు వేయాలి. వేగాక మసాలా ముద్ద వేసి నాలుగు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉడికించిన పప్పులూ కూరగాయల ముక్కలూ వేసి సిమ్‌లో ఐదారు నిమిషాలు ఉడికించాలి. తరవాత చింతపండు గుజ్జు వేసి కలిపి ఐదారు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు మిశ్రమం కాస్త పలచగా అయ్యేందుకు తగినన్ని మరిగించిన నీళ్లను పోసి మళ్లీ ఐదు నిమిషాలు మరిగించి దించాలి. ఇది బ్రౌన్‌ రైస్‌లోకి చాలా రుచిగా ఉంటుంది.

ఇదీ చదవండి: నోరూరించే బెంగాలీ 'ఫిష్‌ పటూరి'.. ట్రై చేస్తే పోలా?

ABOUT THE AUTHOR

...view details