రోజాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతే ఆరోగ్యాన్నిస్తాయి. ! వాటి సువాసన మనసుకు హాయినిస్తుంది. గులాబి రేకులు ఆహారంగా తీసుకుంటే శరీరానికి చలవనిచ్చి.. రోజంగా తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. అలాంటి గుబాళించే గులాబి పూలను, తేనె, చక్కెరలో ఊరబెడితే తయారవుతుంది గుల్కండ్. మార్కెట్లో సులభంగా లభించే గుల్కండ్‌ను నేరుగా తింటే అద్భుతంగా ఉంటుంది. అదే ఆ గుల్కండ్తో మిల్క్ షేక్ చేసుకుంటే అదిరిపోతుంది. అజీర్తిని దూరం చేసే గుల్కండ్ షేక్‌ను సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..
కావలసినవి ఇవే...
చల్లని పాలు-500 మి.లీ. , గుల్కండ్-2 చెంచాలు, పిస్తా, బాదాం-2 చెంచాలు, ఓ గులాబి పువ్వు- అలంకరణకు.