ఇప్పుడంటే కూల్‌డ్రింక్‌లు, జ్యూస్‌లు అంటూ.. ఎన్నో వేసవి ప్రత్యేక పానియాలు దొరుకుతున్నాయి. అవన్నీ కేవలం దాహాన్ని మాత్రమే తీర్చుతాయి. కానీ, సనాతన కాలం నుంచి వేసవి వచ్చిందంటే చాలు.. భారతీయుల ఆరోగ్యాలను 'చల్ల'గా కాపాడుతున్న దివ్య ఔషదం మాత్రం ఒకటే.. అదే 'చాస్'. మజ్జిగ, చల్ల, బటర్ మిల్క్, చాస్ ఇలా పేరేదైనా కానీ, ఒంటికి చలవనిస్తుంది. జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలిస్తుంది. మరి, అలాంటి అద్భతమైన మజ్జిగను మరింత రుచిగా ఎలా చేసుకోవాలి అంటారా?
కావలసినవి ఇవే..
పెరుగు-500 గ్రాములు , పుదీనా ఆకులు- ఆరు, ఉప్పు-ఒక టీ స్పూను, పచ్చిమిర్చి-రెండు, అల్లం-చిన్న ముక్క, కరివేపాకు-ఒక రెబ్బ, నల్లఉప్పు-చిటికెడు, జీలకర్ర పొడి-చిటికెడు, నిమ్మకాయ-ఒకటి