వినాయక చవితి (vinayaka chavithi) ఎంతో ప్రత్యేకమైన పండగ. విగ్రహాలు, పూజల దగ్గర నుంచి వంటకాల వరకు భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. దేవుడి నైవేద్యంగానే కాక అతిథులకు, ఇంట్లో వారికోసమూ ఎన్నో రకాల రుచులు సిద్ధమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక చవితి కోసమే ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పాయసాలు (payasam) ఏంటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
పాలతాలికలు
కావాల్సినవి:
బెల్లం, బియ్యపు పిండి, పాలు, సగ్గుబియ్యం, యాలకుల పొడి, చక్కర, డ్రై ఫ్రూట్స్
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు, బియ్యపు పిండి వేసి కలుపుకొని పిండికి సరిపడా పాలు పోసి తడుపుకోవాలి. ఇలా తడుపుకొన్న పిండిని తాలికలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలతాలికలు కూడా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి, యాలకుల చక్కర పొడి వేసి కలుపుకొన్న తర్వాత.. ముందుగా ఫ్రై చేసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పాలతాలికలు రెడీ.
బియ్యం పిండి పాయసం
కావాల్సినవి: