- పుచ్చకాయ-తులసి టీ...
కావాల్సినవి
* మరిగించిన నీరు - 10 కప్పులు
* టీ బ్యాగులు - 10
* చిన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు - ఒక కప్పు
* తులసి ఆకులు - అర కప్పు
* చక్కెర - రుచికి సరిపడా
తయారీ
ముందుగా మరిగించిన నీటిలో టీ బ్యాగుల్ని వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. ఆపై వాటిని తొలగించి ఆ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక్కో కప్పు లేదా గ్లాసులో ఆ నీటిని పోసి అందులో పుచ్చకాయ ముక్కలు, తులసి ఆకులు, సరిపడా చక్కెర వేసి ఆఖరున ఐస్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరి.. పుచ్చకాయ-తులసి ఐస్డ్ టీ సిద్ధం. శరీరంలోని వేడిని దూరం చేసి చల్లదనాన్ని పంచుతుందీ ఛాయ్.
- కీరా-పుదీనా టీ
కావాల్సినవి
* నీళ్లు - 4 కప్పులు
* గ్రీన్ టీ బ్యాగులు - 4
* పుదీనా ఆకులు - అరకప్పు
* చెక్కు తీసి చిన్నగా తరిగిన కీరా ముక్కలు - ఒక కప్పు
* తేనె - పావు కప్పు
* నిమ్మరసం - పావు కప్పు
తయారీ
నాలుగు గ్రీన్ టీ బ్యాగుల్ని నాలుగు కప్పుల నీళ్లలో వేసి అందులోనే కీరా దోస ముక్కలు, పుదీనా ఆకుల్ని వేసి పావుగంట పాటు సిమ్‌లో మరిగించుకోవాలి. ఆపై ఈ మిశ్రమం చల్లారాక వడకట్టుకొని దీనికి నిమ్మరసం, తేనె, ఐస్ ముక్కలు చేర్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన అతిథులకు ఈ టీని అందించచ్చు.
- నిమ్మరసం-అల్లం టీ
కావాల్సినవి
* బ్లాక్ టీ బ్యాగులు - 5
* నీళ్లు - 5 కప్పులు
* నిమ్మకాయలు - 2 (స్త్లెసుల్లా కట్ చేసుకోవాలి)
* అల్లం తురుము - రెండు టీస్పూన్లు
* తేనె - పావు కప్పు
తయారీ
ముందుగా టీ బ్యాగుల్ని నీటిలో వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకోవాలి. ఆలోపు గ్లాసుల్లో నిమ్మ స్త్లెసెస్, అల్లం తురుము వేసి రడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన నీటిలోని టీ బ్యాగుల్ని తొలగించి ఆ నీటిని గ్లాసుల్లో పోసుకోవాలి. ఆఖరున తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎండ వల్ల అలసిన మెదడును పునరుత్తేజితం చేస్తుంది.
- రాస్బెర్రీ ఐస్డ్ టీ