తెలంగాణ

telangana

ETV Bharat / priya

'దేశీ పిజ్జా'తో ఇంట్లోనే మజా చేసుకోండి!

ఇంట్లో పిజ్జా చేసుకోవాలంటే అదో పెద్ద తతంగం అనుకుంటాం. అవును మరి, పరదేశ వంటకాలకు కావలసిన సామగ్రి మనింట్లో అంత విరివిగా దొరకవు కదా! అందుకే, ఇటాలియన్‌ పిజ్జాను ఇండియన్‌ స్టైల్‌లో తయారుచేస్తే అదిరిపోదూ? కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతో చిటికెలో తయారయ్యే దేశీ పిజ్జా రెసిపీ చూసేద్దాం రండి..

simple-pizza-with-no-cheese-no-yiest-no-butter-no-olives-totally-indian-style-recipe
'దేశీ పిజ్జా'తో ఇంట్లోనే మజా చేసుకోండి!

By

Published : Jul 24, 2020, 1:04 PM IST

దేశీ పిజ్జా.. పేరుకు తగ్గట్టుగానే స్వదేశీ పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. పైగా మన భారతీయ సంప్రదాయ పోషకాలను పొందొచ్చు. మరి రెసిపీపై ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు

  • గోధుమ పిండి (మీకు నచ్చిన పిండి కూడా వాడుకోవచ్చు) – కప్పు
  • బటర్‌/ పనీర్‌ – టాపింగ్‌కి తగినంత (తురుముకోవాలి)
  • రింగ్స్‌లా కట్‌ చేసిన ఉల్లిపాయలు – 1
  • గుండ్రంగా కట్‌ చేసిన టొమాటో ముక్కలు – 1
  • పిజ్జా సాస్‌ – కప్పు
  • ఉడికించి, ముక్కలుగా కట్‌ చేసిన బంగాళాదుంప – 1
  • సన్నని ముక్కలుగా కట్‌ చేసిన క్యాప్సికం – 1
  • ఉప్పు – తగినంత
  • పచ్చి మిరపకాయలు – రెండు (సన్నగా కట్‌ చేసినవి)
  • గరం మసాలా – టీస్పూన్‌

తయారీ విధానం

పిండిని ఓ గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీటిని చేర్చుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చపాతీలా ఒత్తుకుని దానిపై పిజ్జా సాస్‌ రాసుకోవాలి. ఆపై పనీర్‌, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, కట్‌ చేసిన పచ్చి మిరపకాయలు, టొమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు.. ఇలా అన్నింటినీ అచ్చం పిజ్జాపై పరిచినట్లుగా పరవాలి. చివరగా దానిపై గరం మసాలా, తురిమిన బటర్‌ని చల్లుకొని ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద ఓ అరగంటపాటు బేక్‌ చేస్తే సరి. దేశీ స్టైల్‌లో పిజ్జా తయారైనట్లే!

ఇదీ చదవండి: 'ఆలూ బ్రెడ్‌ రోల్స్‌' ఇలా చేసుకుంటే అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details