తెలంగాణ

telangana

ETV Bharat / priya

Mushroom Fry: పుట్టగొడుగులతో నోరూరించే వేపుడు.. ట్రై చేశారా? - పుట్టగొడుగుల ఫ్రై తయారీ విధానం

శాకాహారులకు మాంసకృత్తులు అందించే పదార్థాల్లో పుట్టగొడుగులు (Mushroom Fry) కూడా ఒకటని తెలిసినా వాటిని ఎలా వండుకోవాలో చాలామందికి తెలియకపోవచ్చు! అయితే వాటితో చేసే వంటకాలు ఏంతో రుచిగా ఉంటాయి. అందుకే పుట్టగొడుగుల వేపుడు వండుకుంటే... పోషకాలకు పోషకాలు అందడంతోపాటూ కాస్త వెరైటీగా ప్రయత్నించినట్లు ఉంటుంది.

simple mushroom fry recipes homemade for dinner
పుట్టగొడుగు వేపుడు

By

Published : Sep 18, 2021, 4:01 PM IST

వెజ్​లో కూడా నాన్​వెజ్ తిన్న అనుభూతిని ఇచ్చేవి అంటే పుట్టగొడుగులే. వీటితో ఎలాంటి రెసిపీలు చేయాలో తెలియక చాలామంది కొనడం కూడా మానేస్తుంటారు. కానీ ఓసారి వీటికి అలవాటుపడితే వదులుకోవడం చాలా కష్టం! అంత రుచిగా ఉంటాయి మరి. అయితే పుట్టగొడుగులతో (Mushroom Fry) చేసుకొనే వేపుడు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ స్టోరీ చదివి వంటింట్లో గరిటె తిప్పేయండి.

కావాల్సిన పదార్థాలు

  • పుట్టగొడుగులు
  • ధనియాలు
  • జీలకర్ర
  • మిరియాలు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు
  • నూనె
  • ఉల్లిపాయ ముక్కలు
  • పచ్చిమిర్చి
  • ఉప్పు
  • టమాటాలు

తయారీ విధానం

ముందుగా స్టవ్​ వెలిగించి, ఒక పాన్​లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి డ్రై రోస్ట్​ చేసుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పౌడర్​గా చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్​లో నూనెలో వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సరిపడాఉప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో కట్​ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్​, పసుపు, ముందుగా కట్​ చేసుకొన్న పుట్టగొడుకు ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తరువాత కారం, సరిపడా ఉప్పు, ముందుగా మిక్సీ పుట్టుకొన్న మసాలా పొడి, కరివేపాకు, నిమ్మరసం వేసి కలుపుకొని చివరగా కొత్తిమేర వేసి కలుపుకుంటే పుట్టగొడుగు వేపుడు రెడీ అవుతుంది.

ఇదీ చూడండి:చవితి నైవేద్యాలు: 'గుడ్​ కా మాల్​ పువా' ఇలా చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details