వీకెండ్‌ను మంచి ఫుడ్‌తో(Shahi Chicken Biriyani recipe) ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా!. అయితే.. ఈ తరహా చికెన్ బిర్యానీని ఈ సారి కొత్తగా (Chicken Biriyani recipe) ట్రై చేయండి! నోరూరించే షాహీ బిర్యానీని తయారు చేసుకోండిలా..
కావల్సిన పదార్థాలు:
నెయ్యి, గరం మసాలా, చికెన్, బాస్మతి బియ్యం, పెరుగు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు.
తయారీ విధానం:
పొయ్యిపై గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి పోసి, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి. మరో గిన్నెలో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. దానిలో బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. చికెన్ ఉడుకుతున్న గిన్నెలో పెరుగు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఉడికించాలి. ఆ తర్వాత దానిలో కొంచెం గ్రేవీని బయటికి తీసి పెట్టుకోవాలి. చికెన్ ఉన్న గిన్నెలో ఉడికిన అన్నం వేసి దానిపై గ్రేవిని చల్లుకోవాలి. అనంతరం కాసేపు పొయ్యిపైనే ఉంచి వేడిచేయాలి. ఐదు నిమిషాలు ఆగి ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన షాహీ బిర్యానీ రెడీ అవుతుంది.
ఇదీ చదవండి:chicken 555 biryani: నోరూరించే చికెన్ 555 చేసేద్దామా?