తెలంగాణ

telangana

ETV Bharat / priya

saggubiyyam benefits: కరకరలాడే సగ్గుబియ్యం పొంగనాలు తిన్నారా?

పొంగనాలు సాధారణంగా బియ్యం పిండితో చేస్తుంటారు. కానీ బియ్యంలో సగ్గుబియ్యం(Saggubiyyam Recipes) కలిపి చేసిన పొంగనాలు ఎప్పుడైనా తిన్నారా? కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పొంగనాలను ఎలా తయారు చేయాలంటే?

By

Published : Oct 1, 2021, 7:01 AM IST

Saggubiyyam Ponganalu
సగ్గుబియ్యం పొంగనాలు

సాధారణంగా పొంగనాలు బియ్యం పిండితో, మరికొంత మంది దోశపిండితో చేస్తుంటారు. కానీ బియ్యం పిండిలో సగ్గుబియ్యం(Saggubiyyam Recipes) కలిపి పొంగనాలు ఎప్పుడైనా ట్రై చేశారా? రుచితోపాటు, ఆరోగ్యాన్నిచ్చే సగ్గుబియ్యం(Saggubiyyam Benefits) పొంగనాలు తయారీ విధానం చూసేద్దామా?

కావాల్సిన పదార్థాలు:

  • నానబెట్టిన బియ్యం
  • మినపప్పు
  • సగ్గుబియ్యం
  • ఉప్పు
  • నీరు
  • ఉల్లిపాయ
  • కొత్తిమీర
  • అల్లం

తయారీ విధానం..

ముందుగా మిక్సీజార్ తీసుకొని, అందులో నానబెట్టిన బియ్యం, సగంకప్పు మినపప్పు, 2 కప్పుల నానబెట్టిన సగ్గుబియ్యం(Saggubiyyam Recipes), సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులో ఉప్పు వేసి కలిపి పులియబెట్టుకోవాలి. మరోవైపు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుట్నాలు వేసి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి చట్నీ రెడీ..

ఈ పొంగనాలు కొబ్బరి చట్నీలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం సగ్గుబియ్యం(Saggubiyyam Benefits) పొంగనాలు ఇప్పుడే చేసుకోండి.

ఇదీ చదవండి:Chakkara Pongal recipe: నోరూరించే చక్కెర పొంగళి

ABOUT THE AUTHOR

...view details