సరైన పుడ్ తీసుకోకపోవడం, నీళ్లు మారడం, కాలుష్యం, హార్మోన్ ఇంబ్యాలెన్స్లతో జుట్టు రాలిపోతుంటుంది. దీనికి చెక్ చెప్పాలని చాలా మంది అనేక రకాలైన వాటిని ట్రై చేస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు జామకాయ మిల్క్ షేక్ బాగా పనిచేస్తుంది. అయితే దాని తయారీ విధానం ఏంటో ఓసారి చూద్దాం.
జామకాయ మిల్క్ షేక్ తయారీ విధానం...
ముందుగా జామకాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. జార్ తీసుకొని వాల్నట్స్, పిస్తా, సోయామిల్క్ తీసుకొని దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలు, పాలు వేసుకొని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన పాలు, పంచదార, ఇలాచీ పొడిని వేసి మరోసారి గ్రైండ్ చేసి, సర్వింగ్ గ్లాస్‌లోకి తీసుకుంటే జామకాయ మిల్క్‌షేక్ రెడీ.
జామకాయ మిల్క్‌షేక్‌కు కావాల్సిన పదార్థాలు...
- జామ కాయ
- సోయా మిల్క్
- పాలు
- పంచదార
- పిస్తా
- వాల్నట్స్
- ఇలాచీ పొడి
ఇదీ చూడండి:వెజ్ కర్రీ పఫ్.. ఇంట్లో సింపుల్‌గా చేసుకోండిలా!