తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఆహా అనిపించే 'కట్టా ఆలూ'.. వండేయండిలా..

ఆలూ అంటే అందిరికీ ఫేవరేట్​! కుర్మా చేసిన, కూర వండినా, వేయించినా భలే రుచికరంగా ఉంటుంది. మరి ఈ శీతాకాలంలో అదే ఆలూతో కాస్త ఘాటైన రుచిని ఆస్వాదిస్తే అదిరిపోతుంది కదా! అందుకే.. ఈ సారి ఆహా అనిపించే 'కట్టా ఆలూ'ను ఇలా ట్రై చేసేయండి.

recipe of tasty and healthy katta alu curry
ఆహా అనిపించే 'ఆలూ కట్టా'.. వండేయండిలా..

By

Published : Jan 4, 2021, 1:33 PM IST

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే 'కట్టా ఆలూ'ను ఎలా చేసుకోవాలో చూసేయండి...

కావాల్సినవి:

బంగాళదుంపలు- నాలుగు, జీలకర్రపొడి- పావుటీస్పూను, షాజీరా- పావుటీస్పూను, జీలకర్ర- ముప్పావుటీస్పూను, దనియాలపొడి- పావుటీస్పూను, ఉల్లితురుము- అరకప్పు, వెల్లుల్లి తురుము- టీస్పూను, పచ్చిమిర్చి- రెండు, అల్లంతురుము- టీస్పూను, పసుపు- టీస్పూను, కారం- టీస్పూను, కొత్తిమీర తురుము- 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా తురుము- 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ- ఒకటి, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- అరటీస్పూను

తయారుచేసే విధానం

బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, షాజీరా, దనియాలపొడి వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అల్లం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడు పొట్టు తీసి కోసిన బంగాళదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అవి మెత్తబడ్డాక ఉప్పు, మిరియాలపొడి, కారం వేసి వేయించాలి. చివరగా పుదీనా తురుము, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలిపి దించాలి.

ఇదీ చూడండి:ఆహా! అనిపించే 'ఆలూ మ‌సాలా ఫ్రై'

ABOUT THE AUTHOR

...view details