తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే 'నాటుకోడి ఘీ రైస్'​ తయారు చేసుకోండిలా.. - natu kodi kura

నాటుకోడి చికెన్​తో ఎన్నో వెరైటీలు చేసుకొని ఉంటారు. మరి ఎప్పుడైనా 'నాటుకోడి ఘీ రైస్​​' (Natukodi pulao) ట్రై చేశారా? రుచికరమైన ఈ వంటను ఎలా చేయాలో చూసేయండి మరి.

natu kodi ghe rice recipe
నాటుకోడి ఘీ రైస్

By

Published : Nov 19, 2021, 1:19 PM IST

నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై... ఎప్పుడూ ఇవే తిని బోర్ కొడితే.. ఈసారి నాటుకోడి, నెయ్యితో నోరూరించే 'రైస్'​(Natukodi pulao) ట్రై చేయండి. నాన్​వెజ్​ ప్రియులు ఎంతో ఇష్టపడే ఈ 'నాటుకోడి ఘీ రైస్'(Natukodi pulao) ఎలా తయారు చేసుకోవాలంటే..?

కావాల్సిన పదార్థాలు:

  • నాటుకోడి ముక్కలు
  • ఉప్పు
  • పసుపు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​
  • ధనియాలు
  • జీలకర్ర
  • ఎండుమిర్చి
  • ఉల్లిపాయలు
  • కరివేపాకు
  • బిరియానీ ఆకు
  • దాల్చిన చెక్క
  • పచ్చిమిర్చి
  • జీడిపప్పు
  • కోడిగుడ్లు
  • బాస్మతి అన్నం
  • లవంగాలు
  • యాలకులు

తయారీ విధానం..

ముందుగా బేసిన్​లో నాటుకోడి ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు నాటుకోడి ముక్కలు వేసి, 25 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ప్యాన్​లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి, వేయించి పొడి చేసుకుని పెట్టుకోవాలి.

కడాయిలో నెయ్యి వేసి, వేడెక్కాక అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు ముందుగా ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు వేగాక తీసి, పక్కన పెట్టుకోవాలి. పై నుంచి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాల పొడి జల్లుకోవాలి.

నాటుకోడి ఘీ రైస్

అదే కడాయిలో.. లవంగాలు, యాలకులు, బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించాలి. పచ్చి కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే బాస్మతి అన్నం వేసి, నీళ్లు చల్లుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. పై నుంచి మసాలా చల్లి పెట్టుకున్న నాటు కోడి ముక్కలు వేసి.. కోడిగుడ్డు పొరుటు, వేయించిన జీడిపప్పు వేసుకుంటే 'నాటుకోడి ఘీ రైస్'(Natukodi pulao) రెడీ.

ఇవీ చూడండి:

కరివేపాకు మిరియాలతో చికెన్​ కబాబ్​.. ఇలా చేసేయండి

ఆంధ్రా స్పెషల్.. 'ఉలవచారు కోడి కూర'

ABOUT THE AUTHOR

...view details