తెలంగాణ

telangana

ETV Bharat / priya

టేస్టీ 'రవ్వ షీరా' తయారు చేసుకోండిలా.. - రవ్వ షీరా ఉపయోగాలు

ఎప్పుడూ స్పైసీ, హాట్​ రెసిపీలు ట్రై చేసి బోర్ కొట్టిందా? అయితే ఈసారి తియ్యటి 'రవ్వ షీరా'ను వండి చూడండి.

Rava Sheera recipe preparation
రవ్వ షీరా తయారీ

By

Published : Oct 18, 2021, 6:54 PM IST

ఎక్కువగా పండగల సమయంలో చేసుకునే రవ్వ షీరాను.. మనకు వీలు దొరికినప్పుడు చేసుకుని (rava sheera calories) ఆవురావురుమంటూ లాగించేయొచ్చు. ఇంతకీ దీని తయారీ ఎలా, ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దామా!

రవ్వ షీరా

కావాల్సిన పదార్థాలు: యాలకుల పొడి-ఒక టేబుల్ స్పూన్​, బెల్లం-అరకప్పు, నెయ్యి-రెండు టేబుల్ స్పూన్​లు, రవ్వ-ఒక కప్పు, కిస్​మిస్, నానబెట్టిన బాదం

తయారీ విధానం:

ముందుగా పొయ్యిపై గిన్నె పెట్టి నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించుకోవాలి. మరో గిన్నెలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం రసం పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత కిస్​మిస్​, నానబెట్టుకున్న బాదం కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని బాదంతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ రవ్వ షీరా రెడీ అవుతుంది.

ఇదీ చదవండి:గోళ్లు కొరికే అలవాటుకు ఇలా చెక్​ పెట్టండి..

ABOUT THE AUTHOR

...view details