తెలంగాణ

telangana

ETV Bharat / priya

Ragi Laddu: రుచికరమైన 'రాగి ఓట్స్ లడ్డూ'

అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే రాగి ఓట్స్​ లడ్డూ తయారు చేయడం చాలా సులభం. మరి దీని ఎలా చేయాలంటే?

ragi laddu
రాగి ఓట్స్ లడ్డూ

By

Published : Sep 6, 2021, 7:00 AM IST

లడ్డూ.. ఈ పదం వింటేనే నోరూరుతుంది కదూ! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. రుచితో పాటు, ఆరోగ్యాన్నీ పెంపొందించే 'రాగి ఓట్స్​ లడ్డూ' తయారీ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సినవి..

రాగి పిండి, ఓట్స్, ఖర్జూరం, పాలు, తేనె, నెయ్యి, యాలకుల పొడి, నువ్వులు, కొబ్బరి పొడి, జీడిపప్పు

తయారీ విధానం..

ముందుగా ఖర్జూరం మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు పాన్​లో నెయ్యి వేసి జీడిపప్పు, నువ్వులు విడివిడిగా వేయించుకోవాలి. అదే ప్యాన్​లో రాగిపిండి, ఓట్స్​ పొడి, ఎండు కొబ్బరి పొడి విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో.. వేయించిన నువ్వులు, వేయించిన రాగి పిండి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, కాస్త యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కొన్ని పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేతుల్లో లడ్డూల్లాగా చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపడ్డును లడ్డూలపై ఉంచితే.. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే రాగి ఓట్స్ లడ్డూ రెడీ.

ఇదీ చదవండి:పంచదార లేకున్నా.. మధురంగా లడ్డూ!

ABOUT THE AUTHOR

...view details