తెలంగాణ

telangana

ETV Bharat / priya

'ఓట్స్‌ మంచూరియా' ఇలా చేసుకోండి.. హెల్దీగా ఉండండి!

మంచూరియా అంటే పిల్లలకు, పెద్దలకూ భలే ఇష్టం. కానీ, ఈ కరోనా కాలంలో బయట మంచూరియా ఆర్డర్​ చేసుకునే పరిస్థితి లేదు. పైగా.. మంచూరియా జంక్​ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తింటే ప్రమాదమే. అందుకే, మీ మనసుకు మంచూరియా తిన్నామనే తృప్తిని.. ఆరోగ్యంగా ఉన్నామనే సంతృప్తిని.. రెండూ ఒకే రెసిపీలో అందించేందుకు.. 'ఓట్స్​ మంచూరియా' తయారీ విధానం మీకోసం...

prepare-oats-manchuria-at-home-in-a-very-healthy-way
'ఓట్స్‌ మంచూరియా' ఇలా చేసుకోండి.. హెల్దీగా ఉండండి!

By

Published : Jul 6, 2020, 1:01 PM IST

ఓట్స్ బరువు తగ్గడానికి సహకరించడమే కాదు.. శరీరానికి కావలసినంత శక్తినిస్తుంది. మరి అంత ఆరోగ్యకరమైన ఓట్స్​తో ఓసారి మంచూరియా ట్రై చేయండిలా..

కావల్సినవి

ఓట్స్‌ - రెండు కప్పులు,

క్యారెట్‌, క్యాబేజీ,

కీరా తురుము- అరకప్పు చొప్పున,

బీన్స్‌, సన్నగా తరిగినది- నాలుగు చెంచాలు,

ఉల్లిపాయలు - రెండు,

పచ్చిమిర్చి - ఐదు,

కొబ్బరి తురుము - పావుకప్పు,

క్యాప్సికం తరుగు - నాలుగు చెంచాలు,

అల్లం వెల్లుల్లి మిశ్రమం- అరచెంచా,

సోయా సాస్‌- అరచెంచా,

టమాటా కెచప్‌- మూడు చెంచాలు,

అజినోమోటో - కొద్దిగా,

ఉప్పు- అరచెంచా,

నూనె- వేయించడానికి సరిపడా,

కొత్తిమీర-కొద్దిగా.

'ఓట్స్‌ మంచూరియా' ఇలా చేసుకోండి.. హెల్దీగా ఉండండి!

తయారీ

ఓట్స్‌ను ఓసారి వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండుచెంచాల నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయ ముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. కొంచెం వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమంలో ఓట్స్‌ పొడి, ఉప్పు కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి. నూనె ఎక్కువగా వద్దనుకుంటే ఆవిరిమీద కూడా ఉడికించుకోవచ్చు.

ఆ తరవాత బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, తరుగు, అజినోమోటో చేర్చి వేయించాలి. ఇందులోనే సోయాసాస్‌, టమాటా కెచెప్‌ కలపాలి. చివరగా ఓట్స్‌ ఉండల్ని కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించి తీసేయాలి. కొత్తిమీర తురుము అలంకరిస్తే చాలు.. ఓట్స్‌ మంచూరియా తినడమే ఆలస్యం.

ఇదీ చదవండి: నోరూరించే బెంగాలీ 'ఫిష్‌ పటూరి'.. ట్రై చేస్తే పోలా?

ABOUT THE AUTHOR

...view details