తెలంగాణ

telangana

ETV Bharat / priya

పిందె మామిడితో 'వడు మాంగయ్‌' - vadu mango preparation

సాధారణంగా మామిడి కాయ పచ్చడి అంటే భోజన ప్రియులకు ఎంతో ఇష్టం. మామిడితో వండిన ఏ వంటకాన్ని అయినా ఆస్వాదిస్తూ తింటారు. అలాంటి మామిడితో చేయగల మరో వెరైటీ వంటకమే 'వడు మాంగయ్​'. ఇది ఎక్కువగా తమిళులు చేసుకునే వంటకం. దీని తయారీ విధానం తెలుసుకుందాం.

preparation of vadu mango pickle in telugu language
పిందె మామిడితో పక్కాలోకల్‌ అనిపించే వడు మాంగయ్‌

By

Published : Dec 2, 2020, 2:39 PM IST

పచ్చిమామిడికాయ వచ్చీ రాగానే ముక్కల పచ్చడి పట్టేస్తాం. ఆ తర్వాత సంవత్సరమంతా నిల్వ ఉండేలా ఆవకాయ, మాగాయ పచ్చళ్లను పెట్టుకుంటాం. ఇందుకు కాస్త భిన్నంగా తమిళులు మామిడికాయ పిందెలతో ‘వడు మాంగయ్‌’ అనే పచ్చడి పెడతారు. అయితే దీన్ని ముక్కలుగా కాకుండా కాయపళంగా అలానే పెడతారు. అదే దీని ప్రత్యేకత. ఇది కూడా ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. కాస్త వగరుగా ఉండే ఈ పచ్చడిని సాంబారు, పప్పు, పెరుగు, మజ్జిగ అన్నంలో నంజుకుని తింటే.. ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరంటారు భోజనప్రియులు. నూనె తక్కువ వేసి చేసే ఈ పచ్చడి ఇంట్లో ఉంటే... అమ్మచేరువగా ఉన్నట్టే అని తమిళంలో సామెతలు కూడా చెప్పుకుంటారు.

కావాల్సినవి:

చిన్న మామిడికాయలు- అరకేజీ, ఆముదం లేదా నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, ఆవాలు- టీస్పూన్‌, మెంతులు- అర టీస్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌, ఇంగువ- అర టీస్పూన్‌, ఎండుమిర్చి- ఇరవై.

తయారీ:

మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు టూత్‌పిక్‌తో అక్కడక్కడా చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె, ఉప్పు, కారం కాయలకు బాగా పడుతుంది. వెడల్పాటి పాత్రలో వీటిని వేసి నూనె పోసి అది కాయలకు బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఉప్పు, ఇంగువ, పసుపు వేసి కొద్దిగా మినరల్‌ వాటర్‌ పోసి మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మామిడికాయల్లో వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే దానికి కొద్దిగా నీళ్లు కలపొచ్ఛు ఇప్పుడు దీన్ని జాడీలోకి తీసుకుని భద్రపరుచుకోవాలి. కొందరు దీన్ని బాగా పొడిగానూ పెట్టుకుంటారు.

ఇదీ చూడండి: ఘుమఘుమలాడే 'సుర్మయి ఓమండ్‌' సింపుల్​ రెసిపీ

ABOUT THE AUTHOR

...view details