వడలను సాధారణంగా మినప పప్పుతో చేస్తారు. కానీ ఇది కాస్త సమయంతో (ravva vada recipe) కూడిన పని. తొందరగా, సులభంగా వడలను తయారుచేసుకోవడానికి మినప పప్పుకు బదులు రవ్వను వాడుకోవచ్చు. టేస్టు, టైమ్ రెండు కలిసొచ్చే విధంగా ఈ రవ్వ వడల (ravva vada) తయారీ ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు: రవ్వ, ఉల్లిపాయలు, ఉప్పు, ఇంగువా, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, కొబ్బరి, క్యారెట్, సన్నగా తరిమిన ఇతర కూరగాయలు, కొంచెం సోడా.
తయారీ విధానం:ఓ గిన్నెలో కొద్దిగా రవ్వను నానబెట్టాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసి కలియబెట్టాలి. అనంతరం రవ్వ, ఉల్లిపాయలు, ఉప్పు, ఇంగువా, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, కొబ్బరి వేసి చేతితో బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమంలో సన్నగా తరిమిన క్యారెట్, ఇతర కూరగాయాలు కూడా వేసుకోవచ్చు. మిశ్రమం ఇంకా చిక్కగా కాకపోతే బియ్యం పిండిని కొంచెం కలుపుకోవచ్చు. చిక్కగా మారిన మిశ్రమాన్ని నూనెలో ఉండలుగా వేసి వేయించుకోవాలి. అంతే.. వేడివేడి రవ్వ వడలు రెడీ.
ఇదీ చదవండి:చికెన్ వడా కర్రీ.. ఇడ్లీలతో తింటే ఆహా అనాల్సిందే!