ఇడ్లీలను రొటీన్‌గా సాంబర్తో తింటే విసుగొచ్చేస్తుందా? ఏదైనా స్పెషల్‌గా (special recipe) చేయాలని ఉందా! అయితే ఇడ్లీలతో బర్గర్‌ను (special idli tiffin) ట్రై చేయండి. దీన్ని ఎలా తయారుచేయాలంటే..
కావల్సిన పదార్థాలు:
నూనె, బటర్, ఆవాలు, మినపప్పు, చెనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, ఆలుగడ్డలు, నిమ్మరసం, కొత్తిమీర, ఇడ్లీలు, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీ, టమాటా, ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు.
తయారీ విధానం:
ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత పొయ్యిపై ఓ గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, చెనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. అనంతరం సన్నగా తరిమిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా తురిమిన ఆలుగడ్డలను ఆ మిశ్రమానికి కలిపి నిమ్మరసం, కొత్తిమీర కలుపుకోవాలి.
పొయ్యిపై మరో గిన్నెలో బటర్ వేసి అందులో ఇడ్లీలను (idli burger tiffin) బాగా గ్రిల్ చేసుకోవాలి. ఆ ఇడ్లీలకు ఒకదానికి గ్రీన్ చట్నీ, మరోదానికి అల్లం చట్నీ పూసుకోవాలి. ఒక ఇడ్లీపై టమాటా, ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇంతకు ముందు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఆ ఇడ్లీపై పెట్టుకుని, దానిపై మరో ఇడ్లీని పైకప్పుగా పెట్టుకుంటే ఇడ్లీ బర్గర్ రెడీ..
ఇదీ చదవండి:Idli Recipe: బ్రేక్‌ఫాస్ట్‌గా లైట్ ఫుడ్ కావాలా? రసం ఇడ్లీ ట్రై చేయండి