తెలంగాణ

telangana

ETV Bharat / priya

కాస్త భిన్నంగా 'గోలీ ఇడ్లీలు' వడ్డించండిలా! - గోలీ ఇడ్లీల తయారీ తెలుగులో

ఇడ్లీ.. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే అల్పాహారం. ఆవిరి మీద ఉడికే ఈ తెల్లని ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే.. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొత్తగా గోలీ ఇడ్లీలను (goli edli recipe) తయారు చేసేద్దామా?

goli edli recipe in telugu
గోలీ ఇడ్లీల తయారీ

By

Published : Oct 16, 2021, 7:25 AM IST

దక్షిణ భారత దేశంలో ఫేమస్ అల్పాహారం ఇడ్లీ. అయితే, ప్రాంతాన్ని (goli edli recipe) బట్టి ఇడ్లీ చేసే తీరు మారుతుంది. దానితో పాటు రుచి, ఆకారం మారుతుంది. ఆవిరి మీద ఉడికే ఈ తెల్లని ఇడ్లీలు ఆరోగ్యానికి (edli recipe benefits) ఎంతో మేలు. ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. అయితే.. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా గోలీ ఇడ్లీలను (goli edli recipe in telugu) ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?

గోలీ ఇడ్లీల తయారీ

కావాల్సినవి
బియ్యప్పిండి, నీళ్లు- ఒకటిన్నర కప్పుల చొప్పున, ఉప్పు- తగినంత, వెన్న- పెద్ద చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర, ఆవాలు- అర చెంచా, సెనగపప్పు, మినప్పప్పు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, అల్లం తురుము- చెంచా, కొత్తిమీర తురుము- పెద్ద చెంచా.

తయారీ
కడాయిలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ నీటిలో ఉప్పు, వెన్న వేసి కలపాలి. బియ్యప్పిండిని వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలపాటు మూతపెట్టి అలాగే మగ్గనివ్వాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పదినిమిషాలపాటు ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించాలి.
పొయ్యిపై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. ఇందులో సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, ఇంగువ తాలింపు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇడ్లీలు కలిపి రెండు నిమిషాలపాటు మూతపెట్టి మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడి వేడిగా పల్లీ, కొబ్బరిచట్నీతో తింటే సరి.

ఇదీ చదవండి:ఇడ్లీతో బర్గర్​.. సింపుల్​గా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details