తెలంగాణ

telangana

ETV Bharat / priya

ప్రాన్స్‌ సాంబార్‌ మసాలా ఎప్పుడైనా ట్రై చేశారా?

రొయ్యల వేపుడు, రొయ్యల కర్రీ.. రొయ్యల ఫ్రై ఇలా చాలా విధాలుగా రొయ్యలను తినే ఉంటారు. ఎప్పుడైనా రొయ్యల సాంబార్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశారా? వింటుంటేనే నోరూరుతోంది కదూ.. మరి ప్రాన్స్ సాంబార్ మసాలాను ఎలా వండాలో తెలుసుకోండి ఇప్పుడే.

prawn Sambar Masala Cooking Method
ప్రాన్స్ సాంబార్ మసాలా వండు విధానం

By

Published : Nov 5, 2020, 1:00 PM IST

సాంబార్ మసాలా అంటే అందరూ ఇష్టంగా తినేస్తుంటారు. రొయ్యల సాంబార్ మసాలా ఎప్పుడైనా ట్రై చేశారా? రొయ్యలతో సాంబార్ మసాలానా? కొత్తగా ఉంది కదూ. మరి అది ఎలా వండాలి? దానికి కావాల్సిన పదార్థాలేమిటి? అనే వివరాలు మీ కోసం.

కావల్సినవి:

నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - నాలుగు, కొబ్బరి తురుము - పావుకప్పు, వెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, టొమాటోలు - ఆరు, జీలకర్రపొడి - చెంచా, పసుపు - చిటికెడు, కారం - చెంచా, సాంబార్‌ మసాలా - చెంచా, నీళ్లు - కప్పు, వెనిగర్‌ - చెంచా, చక్కెర - టేబుల్‌స్పూను, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత.

తయారీ:

ముందుగా బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి ముద్ద వేయాలి. రెండు నిమిషాల తరవాత కొబ్బరి ముద్ద వేసి వేయించాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక కాసిని నీళ్లు చల్లాలి. అందులో టొమాటో ముక్కలూ, తగినంత ఉప్పూ, జీలకర్రపొడి, పసుపు, కారం, సాంబార్‌ మసాలా వేసేయాలి. కొన్ని నిమిషాలకు ఇది గ్రేవీలా తయారవుతుంది. అప్పుడు శుభ్రం చేసిన రొయ్యలూ, నీళ్లూ, చక్కెర, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. రొయ్యలు ఉడికి ఇది గ్రేవీలా తయారయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది.

ఇదీ చూడండి:మటన్‌తో పసందైన కశ్మీరీ బిర్యానీ చేద్దామిలా!

ABOUT THE AUTHOR

...view details