తెలంగాణ

telangana

ETV Bharat / priya

'పొట్లం చేప వేపుడు'.. ఇది చాలా డిఫరెంట్ గురూ!

ఈ వీకెండ్​ కాస్త డిఫరెంట్​గా ఏదైనా వంట ట్రై చేద్దామనుకుంటున్నారా? అయితే దీనిని ప్రయత్నించి చూడండి. ఆకలితో ఉన్న మీ పొట్టకు ఫుల్​మీల్స్ తినిపించండి!

Potlam Fish Fry recipe in telugu
పొట్లం చేప వేపుడు

By

Published : Aug 12, 2021, 7:31 PM IST

చికెన్, మటన్ తిని తిని బోర్ కొట్టిందా? మంచిగా సీ ఫుడ్​ తింటే బాగుండు అనిపిస్తోందా. అయితే ఈ రెసిపీ మీకోసమే. చాలా సులభంగా, మీకు అందుబాటులో ఉన్న పదార్థాలతో దీనిని తయారు చేసుకోవచ్చు! మరి ఎలా చేయాలో చూసేద్దామా.

కావలసిన పదార్థాలు

చేప(మీడియం సైజ్), పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉప్పు, నిమ్మరసం, నూనె, అరటాకు, పచ్చిమిర్చి, స్వీట్ మిర్చి, కొత్తమీర, పూదీన, కరివేపాకు, కొబ్బరిపాలు

తయారీ విధానం

ముందుగా చేపకు రెండు వైపుల గాట్లు పెట్టాలి. ఓ ప్లేట్​లో పసుపు, ఇంగువ, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని, వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేపకు పట్టించాలి.

ఓ అరటాకును మంటపై కాల్చి, మనకు కావాల్సిన పరిమాణంలో కత్తిరించుకోవాలి. అందులో చేప, తరిగిన కొత్తిమీర, పుదీన, కరివేపాకు, స్వీట్ మిర్చి, పచ్చిమిర్చి వేసి.. దానిని పొట్లంలా చుట్టాలి. మరో ఆకును దానికి చుట్టాలి.

గ్యాస్​ స్టవ్​ వెలిగించి, ఓ పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసుకోవాలి. అది వేగాక అందులో మనం తయారు చేసిన పొట్లంను ఉంచాలి. దీనిని 7-8 నిమిషాల పాటు రెండు వైపులా ఫ్రై చేయాలి. ఆకుల్ని తొలగించి, అదే పాన్​లో చేపను మిశ్రమంతో కలిపి ఫ్రై చేయాలి. చిన్న కప్పులో కొబ్బరిపాలు తీసుకుని అందులో కాస్త ఉప్పుచేర్చి.. ఆ మిశ్రమాన్ని చేప ఉన్న పాన్​లో వేయాలి. దీనిని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్​లో తీసుకుంటే.. ఎంతో రుచికరమైన 'పొట్లం చేప వేపుడు' రెడీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details