ఈ సంక్రాంతికి.. ఆహా అనిపించే రకరకాల జంతికలను తయారు చేసి ఆస్వాదించండి...
కొబ్బరిపాలతో..
కావాల్సినవి:బియ్యప్పిండి- రెండు కప్పులు, చిక్కని కొబ్బరిపాలు- కప్పు, మినప్పిండి- పావుకప్పు- నువ్వులు, జీలకర్ర- టీస్పూన్ చొప్పున, ఇంగువ- చిటికెడు, వెన్న- టేబుల్‌స్పూన్, ఉప్పు- తగినంత.
తయారీ: వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి, వెన్న, మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. దీంట్లో కొబ్బరిపాలు పోస్తూ బాగా కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోయాలి. కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. జంతికల గొట్టంలో పిండి మిశ్రమాన్ని పెట్టి జంతికలను నూనెలోకి ఒత్తుకోవాలి. నేరుగా నూనెలోకి వేయడం ఇబ్బందిగా ఉంటే.. గరిటె మీద వేసుకుని నూనెలోకి వదలొచ్చు. మధ్యస్థంగా ఉండే మంట మీద జంతికలను రెండు వైపులా వేయించి తీయాలి.