మొక్కజొన్నలు కాల్చుకుని తిన్నా, ఉడికించుకు తిన్నా రుచిగానే ఉంటాయి. కానీ, మనలాంటి ఆహార ప్రియులు అంత రొటీన్‌గా ఎలా తింటాం? అందుకే, ఓ సారి ఇలా మొక్కజొన్న గింజలతో పాన్ కేక్ చేసుకుని చూడండి...
కావల్సినవి
- మొక్కజొన్న పిండి - రెండు కప్పులు
- వెన్న - అర కప్పు
- ఉప్పు - చెంచా
- చక్కెర - చిటికెడు
- కూరగాయలు ఉడికించిన నీరు - అరకప్పు
- బేకింగ్ పౌడర్ - చెంచా
- మిరియాలపొడి - పావుచెంచా
- తాజా మొక్కజొన్న గింజలు - రెండున్నర కప్పులు
- చీజ్ - ఒకటిన్నర కప్పు
- ఎండుమిర్చి గింజలు - అర చెంచా
- టొమాటోలు - రెండు.
వానలో మనసుకోరే 'మొక్కజొన్న పాన్‌కేక్' మనింట్లోనే! తయారీ విధానం...
మిక్సీలో మొక్కజొన్న గింజలు, చీజ్ తురుము వేసి.. మరీ మెత్తగా కాకుండా చేసుకోవాలి. అందులోనే సగం వెన్న, మొక్కజొన్నపిండి, ఉప్పు, చక్కెర, మిరియాలపొడి, బేకింగ్ పౌడర్ వేసి మరోసారి మిక్సీపట్టాలి. తరువాత కూరగాయలు ఉడికించిన నీరు వేయాలి. ఇందులో ఎండుమిర్చి గింజలు, టొమాటో ముక్కలు కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న దోశల్లా వేసుకుని మిగిలిన వెన్నతో కాల్చుకోవాలి.
ఇదీ చదవండి: ఇంత ప్రేమ నాకొద్దు బాబోయ్.. విడాకులిప్పించండి ప్లీజ్!