తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే పన్నీర్​ దమ్​ బిర్యానీ.. చేసుకోండిలా - పన్నీర్​ దమ్ బిర్యానీ వంటకాలు

బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నా.. దేనికి అవే సాటి. హోటళ్లలో పన్నీర్​ కాంబినేషన్​తో చేసే దమ్​ బిర్యానీని తింటే పొందిన అనుభూతిని ఇంట్లో చేసుకునప్పుడు కూడా పొందగలం. అది ఎలా అంటే..

paneer dum biryani
నోరూరించే పన్నీర్​ దమ్​ బిర్యానీ.. చేసుకోండిలా

By

Published : Aug 16, 2021, 11:18 AM IST

మనలో చాలా మంది హోటల్​కు వెళ్లే ముందు అక్కడ ఉన్న ఎన్నో పదార్థాలను లాగించేద్దాం అని అనుకుంటాం. కానీ అక్కడ మెనూ చదివాక మన దృష్టి చివరికి అందులోని బిర్యానీ పైనే పడుతుంది. క్షణం ఆలస్యం చేయకుండా బిర్యానీని ఆర్డర్​ చేసేస్తాం. వెయిటర్​ ఆ బిర్యానీని తెస్తుంటే అందులోంచి వచ్చే ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది.

అందులోనూ నాన్​వెజ్​తో వదిలేస్తే పన్నీర్​, బిర్యానీలది క్రేజీ కాంబినేషన్. పన్నీర్​ ముక్కలతో చేసిన దమ్​ బిర్యానీని తినాలంటే అందరికీ నోరు ఊరుతూ ఉంటుంది. మరి ఈ వంటకాన్ని ఇంట్లో చేస్తే హోటళ్లలో వచ్చిన రుచే ఉంటుందా? ఇలా చేస్తే కచ్చితంగా వస్తుంది.

కావాల్సివని :

బాస్మతి బియ్యం, పన్నీర్​ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్​, ఉప్పు, కారం, పసుపు, నూనె, పెరుగు, , కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి పేస్ట్​, టమాట పేస్ట్,​ కాబూలి చన, ఉల్లిపాయ ముక్కలు.

మసాలా కోసం: షాజీరా, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు

తయారీ :

ముందుగా మరుగుతున్న బాండీ నీళ్లలో షాజీర, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తరువాత అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతీ బియ్యం.. కొంచెం నూనె వేసి 80 శాతం ఉడికించుకోవాలి. మరోవైపు ఒక ప్లేట్​లో పసుపు, ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్​, గరంమసాలా, పెరుగు వేసి కలుపుకొని పన్నీర్​ ముక్కలకు పట్టించాలి. ఒక పాన్​లో నూనె వేడెక్కాక అందులో పన్నీర్​ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్​లో నూనె వేడెక్కాక లవంగాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి, వేయించుకోవాలి. అందులో పుదీనా, కొత్తిమీర, అల్లంవెల్లుల్లి పేస్ట్​, పచ్చిమిర్చి పేస్ట్​, టమాట పేస్ట్​ వేసి ఉడికించుకొని తరువాత అందులో పెరుగు, ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కాబూలి చన వేసి కలుపుకొని మూతపెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి పలుచగా పర్చుకొని పైనుంచి కొంచెం నెయ్యి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్​ ముక్కలు వేసి చిన్న మంటలో 10-15 నిమిషాలు దమ్​ చేసుకుంటే పన్నీర్​ దమ్​ బిర్యానీ రెడీ.

ఇదీ చదవండి :నోరూరించే హైదరాబాద్‌ సబ్జీ దమ్‌కీ బిర్యానీ

ABOUT THE AUTHOR

...view details