తెలంగాణ

telangana

ETV Bharat / priya

పాలకూర జొన్న పొంగనాలు తయారు చేయండిలా! - పోషకాలు ఎక్కువగా ఉండే వంటకాలు

ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు శరీరానికి (healthy recipes indian) అందాలి. ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలను ఒకే విధంగా చేస్తే ఎలా అందుతాయి?. కాంబినేషన్​లో వంటకాలు చేస్తే పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అందుకే పొంగనాలను జొన్నపిండి, పాలకూరతో (jonna pindi ponganaal) కలిపి ట్రై చేయండి.

jonna pindi ponganaalu
పాలకూర జొన్న పొంగనాలు

By

Published : Oct 11, 2021, 7:03 AM IST

కాంబినేషన్​లో వంటకాలను చేసుకుంటే ఎన్నో పోషకాలు (healthy recipes indian) శరీరానికి అందుతాయి. స్నాక్స్​లోనూ ఇలా తయారు (healthy and tasty snacks) చేసుకుంటే కావల్సిన పోషకాలతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే.. జొన్నపిండి, పాలకూరతో పొంగనాలను (healthy and tasty breakfast) ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?

పాలకూర జొన్న పొంగనాలు

కావల్సిన పదార్థాలు: జొన్నపిండి- ఒక కప్పు, పాలకూర- ఒక కప్పు, పచ్చి మిర్చి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్​, అ్లలం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా, నూనె- రెండు టేబుల్​ స్పూన్​లు

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర, ఉప్పు, కొత్తి మీర, పచ్చి మిర్చి పేస్ట్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని చిక్కగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యిపై వేడెక్కుతున్న పొంగనాల ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని పోయాలి. రెండు పక్కల ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ బౌల్​లోకి తీసుకుంటే జొన్న పొంగనాలు తయారవుతాయి.

ఇదీ చదవండి:Jonna Dosa: జొన్న దోశను నిమిషాల్లో చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details