పూరి.. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓ వంటకం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాస్త భిన్నంగా ఆరోగ్యకరమైన వాల్నట్ ఆయిల్‌తో గ్రీన్ పూరి (Palak Poori) చేసేయండి. వాల్నట్ ఆయిల్‌తో పాటు పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి దీని తయారీ తెలుసుకుందామా..
గ్రీన్ పూరీ తయారీ విధానం..
ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పూరి పిండి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శెనగపప్పు, పాలకూర పేస్ట్, పెరుగు, ఉప్పు వేసుకోవాలి. పిండిలాగా కలిపి.. పూరీలుగా చేసుకోవాలి. తరువాత స్టౌవ్ వెలిగించి.. ప్యాన్ పెట్టుకుని, అందులో ఆయిల్ వేసుకొని ముందుగా తయారు చేసిన పూరీలను అందులో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ పూరీ రెడీ అవుతుంది.
గ్రీన్ పూరికి కావాల్సిన పదార్థాలు...
- పూరి పిండి
- పాలకూర పేస్ట్
- పచ్చిమిర్చి ముక్కలు
- వాల్నట్ ఆయిల్
- ఉప్పు
- పెరుగు
- నానబెట్టిన శెనగపప్పు
- క్యారెట్ తురుము
ఇదీ చూడండి:బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే?