తెలంగాణ

telangana

ETV Bharat / priya

రుచికరమైన ఆనియన్​ మసాలా కర్రీ చేయండిలా! - ఆనియన్​ మసాాలా కర్రీ

కర్రీ చేసేటపుడు పోపులో ఒకటో రెండో ఉల్లిగడ్డలు తప్పక వేసుకుంటాం. కర్రీలో ఆనియన్స్​కు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు మరి!. అలా కాకుండా మొత్తం ఉల్లిపాయలతోనే కర్రీ చేస్తే.. సూపర్​గా ఉంటుంది కదా!. మరెందుకు ఆలస్యం రుచికరమైన ఆనియన్​ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

onion masala curry
ఆనియన్ మసాలా

By

Published : Oct 5, 2021, 4:09 PM IST

సాధారణంగా వారానికోసారి మార్కెట్​ నుంచి కూరగాయాలను తెచ్చుకుంటాం. వాటితోనే ఆ వారమంతా గడిపేస్తాం. ఉల్లిగడ్డలు ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఓ నెల రోజులవరకు సరిపోను తెచ్చి పెట్టుకుంటాం. ఇంట్లో కూరగాయలు అయిపోయాయంటే ఏం కూర చేయాలో అర్థం కాక మహిళలు గాబరాపడిపోతుంటారు. అలాంటప్పుడు కేవలం ఉల్లిగడ్డలతోనే రుచికరమైన ఆనియన్​ మసాలా కర్రీ చేయొచ్చు. మరి దాని తయారీ విధానం తెలుసుకుందామా!.

ఆనియన్​ మసాలా కర్రీ

కావాల్సిన పదార్థాలు:ఉల్లిపాయలు, గసగసాల పేస్ట్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, నూనె, పంచదార.

తయారీ విధానం: పొయ్యిమీద ఓ గిన్నెలో కాస్తంత నూనె వేసి అది వేడికాగానే పచ్చిమిర్చి, అల్లం వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనీయాలి. ఆ మిశ్రమానికి గసగసాల పేస్ట్​ కలపాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి, వేరుశెనగ పేస్ట్​ కలుపుకోవచ్చు. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం కలుపుకోవాలి. అనంతరం గ్రేవీ కోసం తగు మోతాదులో నీళ్లు కలపాలి. ధనియాలు, గరం మసాలా కలపాలి. కొత్తిమీర కలిపి పొయ్యి మీది నుంచి దించుకుంటే.. ఆనియన్ మసాలా కర్రీ రెడీ అవుతుంది.

ఇదీ చదవండి:KP ONION: 'ఈ ఉల్లి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details