New Year 2024 Cake Making Process:కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరం అంటే.. కేక్ కట్ చేయాల్సిందే. డిసెంబర్ 31 అర్ధరాత్రి పన్నెండు కావడానికి కొద్ది నిమిషాల ముందు.. ఫ్రిజ్ల్లోంచి కేకులు బయటికి వస్తాయి. అయితే.. చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వీటి ఖరీదు ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అసలే జ్వరాలు.. అందులోనూ కరోనా.. కాబట్టి బయట కొనుగోలు చేసేకన్నా.. కాస్త ఓపిక చేసుకుంటే.. ఇంట్లోనే ఫుల్ హెల్దీ కేక్‌ను ఈజీగా చేసుకోవచ్చు. కేక్ తోపాటు డిన్నర్ కోసం ఘుమఘుమలాడే పులావ్ కూడా సిద్ధం చేసుకోవచ్చు.
ఎగ్‌లెస్ రాగి చాక్లెట్ కేక్:
కావాల్సినవి:
- రాగిపిండి-ముప్పావుకప్పు
- గోధుమపిండి- ముప్పావుకప్పు
- కోకో పొడి- పావు కప్పు,
- చక్కెర- అర కప్పు(పొడి చేసుకోవాలి),
- బేకింగ్ పౌడర్- చెంచాన్నర,
- బేకింగ్ సోడా- అర చెంచా,
- పాలు- కప్పున్నర,
- వెనీలా ఎసెన్స్ - పావు చెంచా,
- కరిగించిన వెన్న- అరకప్పు,
- ఉప్పు- చిటికెడు,
- డార్క్‌చాక్లెట్- 150 గ్రా.,
- ఫ్రెష్ క్రీమ్- 250 ml
- రాళ్ల ఉప్పు- కొద్దిగా,
- బాదం పలుకులు- కొన్ని
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!
తయారీ విధానం:
- ముందుగా ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో ఉప్పు వేసి స్టౌ మీద పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి.
- ఈ లోపు ఓ గిన్నె తీసుకుని అందులో.. రాగి, గోధుమ పిండి, కోకో పొడి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు.. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి కలపాలి.
- ఇందులో పాలు, వెనీలా ఎసెన్స్, కరిగించిన వెన్న వేసి విస్క్ర్తో బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఓ కేక్ టిన్ లేదా గుండ్రటి గిన్నె తీసుకుని దాని లోపల అన్ని వైపులా వెన్న రాసి, చెంచా చొప్పున పిండి, కోకో పౌడర్ వేసి పాత్ర అంతటా అతుక్కునేలా చూడాలి.
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
- ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ను ఈ పాత్రలో సమంగా పరవాలి.
- తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ పాత్రను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దాదాపు 35 నిమిషాలు కుక్ చేయాలి.
- ఆ తర్వాత మూత తెరిచి కేకును చల్లారనివ్వాలి.
- మరోవైపు పొయ్యి మీద మరో పాత్ర పెట్టి డార్క్ చాక్లెట్ ముక్కలు వేసి, ఫ్రెష్ క్రీమ్ పోసి చిన్న మంటపై నెమ్మదిగా కలుపుతుండాలి. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
- చల్లారిన కేకు పైన ఉబ్బుగా ఉన్న భాగాన్ని కట్ చేయాలి.
- తర్వాత కేకుపై చ్లాకెట్ ద్రవాన్ని పోసి, బాదం పలుకులు, చాక్లెట్ తరుగుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ రాగి చాక్లెట్ కేక్ రెడీ.