నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే మహా ఇష్టం. చాలా మందికి ఆదివారం చికెన్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. చికెన్‌తో రకరకాల వంటలు వండుకుని ఆరగిస్తారు. మరి మీరు ఎప్పుడైనా 'కరివేపాకు, మిరియాలతో 'చికెన్ కబాబ్' ట్రై చేశారా? రుచికరమైన ఈ కబాబ్‌ను ఎలా చేయాలో తెలుసుకొని వెంటనే ట్రై చేసేయండి..
కావాల్సిన పదార్థాలు..
- చికెన్
- ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి, జీడిపప్పు
- కారప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి
ఇలా చేసేయండి..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి, చికెన్ ముక్కలు వేసి, ఉప్పు వేసి, 6-7 నిమిషాల వరకు చిన్నగా కుక్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు తీసేసి, అదే నీళ్లల్లో ఉల్లిపాయ, టమాట, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారప్పొడి, గరం మసాలా వేసి బాయిల్ చేయాలి. చివర్లో మిరియాలు వేసి, కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత పేస్ట్‌ను చికెన్ ముక్కలకు అంటించాలి. అనంతరం పెనంపై వెన్న, నూనె వేసి రెండు పక్కలా కుక్ చేసి వేడివేడిగా వడ్డించుకుని తింటే.. కరివేపాకు, మిరియాలతో చేసిన చికెన్ కబాబ్‌ను ఆహా! అనాల్సిందే. ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేసేయండి.
ఇదీ చూడండి:-రెస్టారెంట్ స్టైల్లో డ్రాగన్ చికెన్.. ట్రై చేయండి!