బాస్మతి బియ్యం, కొబ్బరిపాలు, బటన్ మష్రూమ్, మసాలాలు కలిపి సులభంగా, చాలా రుచికరంగా చేసుకునే తేలికైన వంటకం 'పుట్టగొడుగుల పులావ్'(mushroom recipes). దీని తయారీలో సాధ్యమైనంత వరకు తాజా పుట్టగొడుగులు ఉపయోగించాలి. అవి దొరకనప్పుడు ఎండు పుట్టగొడుగులు వాడుకోవచ్చు. వీటితోపాటు రకరకాలైన కూరగాయ ముక్కలూ వేసుకోవచ్చు. బఠాణీ, ఆలూ, క్యారెట్, కాప్సికం, మొక్కజొన్న, బ్రొకొలీ, బేబీ కార్న్ లాంటి కూరగాయలు వాడుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు
కప్పున్నర బాస్మతి బియ్యం, పావుకిలో బటన్ పుట్టగొడుగులు(mushroom benefits), ఒక్కోటి చొప్పున ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, కప్పున్నర చిక్కటి కొబ్బరిపాలు, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మూడు నాలుగు యాలకులు, ఏడెనిమిది మిరియాలు, చెంచా జీలకర్ర
పులావ్(pulao recipe) తయారీలో పాత బాస్మతి బియ్యం(basmati rice calories) వాడుకోవాలి. వీటితో పులావ్ చేస్తే పొడి పొడిగా వస్తుంది. సువాసనలు వెలువడతాయి. పాత బియ్యానికి ఒక వంతు బియ్యానికి రెండొంతుల నీళ్లు పోయాలి. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో తేలికగా చేసుకోవచ్చు. నూనె బదులుగా నెయ్యి వాడితే రుచి పెరుగుతుంది.