నోరూరించే హల్వా వెరైటీలు ఇంట్లోనే తయారు చేసుకోవొచ్చు. మరి అవి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయండి.
గాజర్ హల్వా
కావాల్సినవి:
క్యారెట్లు- అరకేజీ
ఫుల్‌ఫ్యాట్ మిల్క్- అర లీటరు
నెయ్యి- టేబుల్‌స్పూన్
పంచదార- 150 గ్రా
డ్రైఫ్రూట్స్ తురుము(జీడిపప్పు, బాదం, పిస్తా)- పావుకప్పు
యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: క్యారట్లను బాగా కడిగి తొక్క తీసి, తురిమి పక్కన పెట్టుకోవాలి. మందపాటి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే క్యారెట్ తురుము వేసి తక్కువ మంట మీద వేయించాలి. గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద పాలను మరిగించాలి. క్యారెట్ తురుములో పంచదార వేసి ఉడికించాలి. పంచదార పూర్తిగా కరిగి మిశ్రమం గట్టిపడేంత వరకు ఉడికించాలి. పాలను సగం అయ్యేంతవరకు మరిగించి వాటిని క్యారెట్ తురుములో పోసి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద గట్టిపడేంతవరకు ఉడికించాలి. చివరగా యాలకులపొడి, డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి.
ఖర్జూరంతో
కావాల్సినవి:
ఖర్జూరాలు- పావుకేజీ
పాలు- కప్పు
పంచదార- రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి- టేబుల్‌స్పూన్
డ్రైఫ్రూట్స్ తురుము- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ఖర్జూరాల్లోని గింజలను తీసి పాలు పోసుకుని మెత్తని పేస్టులా చేయాలి. కడాయిలో నెయ్యి వేడిచేసి డ్రైఫ్రూట్స్ తురుము వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే ఖర్జూరం పేస్టు వేసి గరిటెతో కలుపుతూ వేయించాలి. పంచదార, యాలకుల పొడి, పాలు పోసి ఉడికించాలి. పంచదార బదులు బెల్లం లేదా తేనె వాడొచ్చు. మిశ్రమం ఉడికి దగ్గరపడిన తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి. చివరగా యాలకుల పొడి వేయాలి.
పెసరపప్పుతో