ఇంటి పనిని సమర్థంగా నిర్వర్తించడానికి నిత్యం పెద్ద యుద్ధమే చేస్తుంటారు ఆడవారు. అయినప్పటికీ కొన్ని పనులు తీరని సమస్యలుగానే ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించి వాటిని పరిష్కరించవచ్చు. ఇంతకీ అవేంటో చూద్దామా!.
- వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిని కాగితపు సంచిలో వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- కాకరకాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ అవి పండిపోతూ ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో ఉంచితే త్వరగా పండిపోకుండా ఉంటాయి.
- ఆకుకూర కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని పూల మొక్కల మొదళ్లలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.
- ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే ఉల్లిపాయ ముక్కలు కడిగిన నీళ్లను మొక్కల్లో పోస్తే కీటకాలు రాకుండా ఉంటాయి.
- కిటికీలు, తలుపుల సందుల నుంచి చీమలు ఇంట్లోకి వస్తుంటే ఆ ప్రాంతంలో దాల్చిన చెక్కను పెట్టి ఉంచితే చీమలు రాకుండా ఉంటాయి.
- కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేసుకుని ఒక గంట తర్వాత తలంటు స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
- చలికాలంలో ఎక్కువగా నూనె గడ్డ కడుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో ఆవ నూనె కలిపితే నూనె గడ్డ కట్టకుండా ఉంటుంది.
- గచ్చు నేల కడిగేప్పుడు ఆ నీళ్లలో కొంచెం ఉప్పు వేసి కడిగితే ఆరిన తర్వాత ఈగలు వాలకుండా ఉంటాయి.
- పకోడీలు కరకరలాడుతూ ఉండాలంటే శనగ పిండిలో వేడి నూనె, చిటికెడు వంట సోడా కలిపి పకోడీ చేస్తే పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి.
మరిన్ని చిట్కాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడండి.