తెలంగాణ

telangana

పైనాపిల్ చికెన్​.. తింటే వావ్ అనాల్సిందే!

By

Published : Aug 1, 2021, 6:05 AM IST

చల్లని వాతావరణంలో చాలా మందికి వేడి వేడిగా చికెన్​ పదార్థాలు తినాలపిస్తుంటుంది. అయితే.. ఎప్పుడూ చేసుకునే వంటకాలు కాకుండా కాస్త వెరైటీగా ప్రయత్నిస్తే.. ఎంచక్కా పైనాపిల్​ చికెన్​ తయారుచేసుకోవచ్చు.

pineapple chicken recipe
పైనాపిల్​ చికెన్​

భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో చికెన్ ముందుంటుంది. వీకెండ్ వచ్చిందంటే ముఖ్యంగా ఆదివారం నాన్​వెజిటేరియన్స్​ ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది ఈ వంటకే. అయితే ఈ చికెన్​ రొటీన్​గా చేసుకోకుండా కాస్త వెరైటీగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అలాంటి వారి కోసమే ఈ పైనాపిల్ చికెన్ తయారీ విధానం.

పైనాపిల్‌ చికెన్‌

కావాల్సిన పదార్థాలు

పైనాపిల్‌ జ్యూస్‌- అరకప్పు

సోయాసాస్‌- మూడు చెంచాలు

చికెన్‌ ఉడికించిన నీళ్లు- పావుకప్పు

ముదురురంగు పంచదార(బ్రౌన్‌షుగర్‌)- అరకప్పు

సన్నగా తరిగిన వెల్లుల్లిపలుకులు- చెంచా

మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు

వంటనూనె- చెంచాన్నర

బోన్‌లెస్‌ చికెన్‌- అరకిలో( ముక్కలుగా చేసి పెట్టుకోవాలి)

పైనాపిల్‌ ముక్కలు- కప్పు

వేయించిన జీడిపప్పు పలుకులు- మూడు చెంచాలు

తయారీ విధానం

ఉప్పు, మిరియాలపొడి పట్టించిన చికెన్‌ని గంటపాటు పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి పాన్‌లో పైనాపిల్‌జ్యూస్‌, సోయాసాస్‌, చికెన్‌స్టాక్‌, పంచదార, వెల్లుల్లి పలుకులు, మొక్కజొన్నపిండి, ఉప్పు వేసి అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో బాగా దగ్గరకు వచ్చేంతవరకూ మరిగించుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని రెండు చెంచాల నూనె వేసి అందులో చికెన్‌ ముక్కలని వేసి నీరు అంతా బయటకు వచ్చేంతవరకూ ఉడకనివ్వాలి. పొడిగా ఉన్న చికెన్‌కి ముందుగా మరిగించి పెట్టుకున్న సాస్‌ వేసి కలపాలి. చికెన్‌ ఉడికిన తర్వాత దీనికి పైనాపిల్‌ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి మరో నిమిషంపాటు ఉడకనివ్వాలి. అంతే వేడి వేడి పైనాపిల్‌ చికెన్‌ సిద్ధం.

ఇదీ చూడండి:రుచికరమైన చికెన్​ ఫ్రాంకీ చేసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details