తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఘుమఘుమలాడే 'చికెన్​ టిక్కా మసాలా' రెసిపీ - చికెన్​ టిక్కా తయారీ

చల్లని వాతావరణంలో చాలా మందికి వేడి వేడిగా చికెన్​ పదార్థాలు తినాలపిస్తుంటుంది. అయితే.. ఎప్పుడూ చేసుకునే వంటకాలు కాకుండా కాస్త వెరైటీగా ప్రయత్నిస్తే.. ఎంచక్కా చికెన్​ టిక్కా మసాలా తయారుచేసుకోవచ్చు.

MAKING NON VEG ITEM CHICKEN TIKKA MASALA
చికెన్​ టిక్కా మసాలా

By

Published : Oct 21, 2020, 4:36 PM IST

Updated : Oct 21, 2020, 5:34 PM IST

నాన్​వెజ్​ ఐటమ్స్​లో చికెన్​తో ఎన్నో రకాల వంటకాలు చేస్కోవచ్చు. వాటలో ఒకటి చికెన్​ టిక్కా మసాల. ఫ్రై లేదా గ్రేవీ.. ఎలాగైనా తయారు చేస్కోవచ్చు. చెప్తుంటేనే నోరూరేస్తుంది కదూ.? అయితే.. లేటెందుకు మీ ఇంట్లోనే తయారు చేస్కోండిలా..

కావలసినవి:

  • బోన్‌లెస్‌ చికెన్‌: అర కిలో
  • పెరుగు: అర కప్పు
  • నిమ్మరసం: టీస్పూను
  • పసుపు: అర టీస్పూను
  • కారం: అర టీస్పూను
  • మిరియాలపొడి: అర టీస్పూను
  • గరంమసాలా: అర టీస్పూను
  • ఉప్పు: చిటికెడు
  • గ్రేవీ కోసం:
  • నూనె: టేబుల్‌ స్పూను
  • వెన్న: టేబుల్‌ స్పూన్లు
  • యాలకులు: మూడు
  • లవంగాలు: రెండు
  • దాల్చిన చెక్క: అంగుళం ముక్క
  • ఉల్లిపాయ: ఒకటి
  • ఉప్పు: తగినంత
  • అల్లం వెల్లుల్లి: 2 టేబుల్‌ స్పూన్లు
  • దనియాల పొడి: 2 టీస్పూన్లు
  • జీలకర్ర: టీ స్పూను
  • కారం: అర టీస్పూను
  • టొమాటోలు: నాలుగు
  • టొమాటోగుజ్జు: 2 టేబుల్‌ స్పూన్లు
  • మంచినీళ్లు: కప్పు
  • పంచదార: టేబుల్‌ స్పూను
  • గరంమసాలా: అర టీస్పూను
  • క్రీమ్‌: కప్పు
  • కొత్తిమీర: కొద్దిగా

తయారుచేసే విధానం:

  1. పెరుగులో నిమ్మరసం, పసుపు, కారం, మిరియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి చికెన్‌ ముక్కలకు పట్టించి ఉంచాలి.
  2. విడిగా బాణలిలో నూనె, వెన్న వేసి కాగాక కాస్త కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేగాక.. అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు దనియాల పొడి, జీలకర్ర, కారం, టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు వేసి నూనె తేలేవరకూ ఉడికించాలి.
  3. తరవాత చికెన్‌ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలపాటు ముక్క మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా క్రీమ్‌ వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి.

ఇదీ చదవండి:ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

Last Updated : Oct 21, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details