తెలంగాణ

telangana

ETV Bharat / priya

తోడు లేకుండానే పెరుగు తయారు చేసుకోండిలా..!

పాలను పెరుగుగా మార్చాలంటే తోడు పెట్టాల్సిందే.. అయితే తోడు కోసం.. పక్కింట్లోకో లేక ఎదురింట్లోకో వెళ్తుంటాం. కానీ తోడు లేకుండానే పెరుగు తయారుచేసుకునే సులువైన విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

making curd without curd
తోడు లేకుండానే పెరుగు

By

Published : Aug 10, 2021, 7:50 AM IST

భారతీయ వంటకాల్లో పెరుగుకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. భోజనంలో ఎన్ని వంటకాలు తిన్నా.. పెరుగు లేకుంటే మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తుంది. మరి అందరికీ ఇష్టమయ్యే.. ఈ పెరుగు రెడీ అవ్వాలంటే ముందు తోడు ఉండాల్సిందే.. అయితే తోడు లేకుండానే పెరుగు తయారు చేసుకునే అద్భుతమైన చిట్కాను ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

  • గోరు వెచ్చని పాలు
  • ఎండు మిరపకాయలు

తయారీ విధానం..

మొదట పాలను బాగా వేడిచేసి.. తర్వాత చల్లార్చి పక్కనపెట్టాలి. ఆ గోరువెచ్చని పాలలో తొడిమలు ఉన్న ఎండుమిరపకాయలను వేయాలి. ఇప్పుడు ఆ పాలను కుక్కర్​లో పెట్టి మూతపెట్టాలి. 24 గంటలపాటు పక్కనపెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ తీసి చూస్తే.. నాణ్యమైన పెరుగు మీసొంతం.. మీరూ తప్పకుండా ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details