కొబ్బరి తురుము, పంచదార మిశ్రమంతో అద్భుతమైన 'కొబ్బరి బర్ఫీ'ని తయారు చేసుకోవచ్చు. అదెలాగంటారా? ఇదిగో ఇలా చేస్తే సరి...
కావలసినవి:
- కొబ్బరి తురుము: 2 కప్పులు
- పాలు: 3 కప్పులు
- మీగడ: అరకప్పు
- కుంకుమపువ్వు: కొద్దిగా
- పంచదార: 400 గ్రాములు
- యాలకులపొడి: అరటీస్పూను
తయారుచేసే విధానం:
పాన్‌లో పాలు, కొబ్బరి తురుము, మీగడ, పంచదార వేసి కలుపుతూ సిమ్‌లో ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడ్డాక అందులోకి యాలకుల పొడి, పాలల్లో కలిపిన కుంకుమపువ్వు టీస్పూను వేసి కలిపి దించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి అట్లకాడతో సమంగా సర్దాలి. ఈ మిశ్రమం ఆరాక.. మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే సరి. ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ తయారైనట్లే.
ఇదీ చదవండి:'కోకోనట్ రైస్ పుడ్డింగ్' సింపుల్ రెసిపీ