తెలంగాణ

telangana

ETV Bharat / priya

దీపావళి స్పెషల్- 'క్యారెట్​ గులాబ్​జామ్​' చేయండిలా..

దీపావళి పండుగకు కొత్త రకం పిండి వంటలను ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ చేసుకునే స్వీట్స్​ కాకుండా మరోలా ప్రయత్నించాలి అనుకుంటున్నారా? అయితే.. ఇలా సింపుల్​గా క్యారెట్​ గులాబ్​జామ్​ను ట్రై చేయండి. ఇదిగో తయారీ విధానం మీకోసం.

CARROT GULAB JAM
క్యారెట్​ గులాబ్​జామ్

By

Published : Nov 13, 2020, 5:02 PM IST

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్​తో కూరలు, హల్వా వంటకాలే కాకుండా.. ఎంచక్కా గులాబ్​జామ్​ కూడా చేసుకోవచ్చు. అదెలాగంటారా? ఇదిగో మీరే చేసేయండిలా...

కావలసినవి:

  • క్యారెట్‌ తురుము - కప్పు
  • కొబ్బరి తురుము - కప్పు
  • పంచదార - 2 కప్పులు
  • గులాబ్‌ జామ్‌ పొడి - 200 గ్రాములు
  • జీడిపప్పు - 50 గ్రాములు
  • నూనె లేదా నెయ్యి - తగినంత
  • బాదంపప్పు - 50 గ్రాములు
  • యాలకుల పొడి - టీ స్పూను
  • పాకం కోసం - పంచదార అరకిలో

తయారుచేసే విధానం:

బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేగాక, క్యారెట్‌ తురుము వేసి వేయించాలి. తరవాత కొబ్బరితురుము కూడా వేసి ఐదు నిమిషాలు వేగాక పంచదార వేసి దగ్గరగా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి. చివరగా అర టీ స్పూను యాలకుల పొడి చల్లి దించేయాలి. ఆరాక చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఉండలను గుండ్రంగా గానీ దీర్ఘచతురస్రాకారంలోగానీ మనకిష్టమైనట్లుగా చేసుకోవచ్చు.

మందపాటి గిన్నెలో నీళ్లు, పంచదార వేసి లేతపాకం వచ్చేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఈ పాకంలో మిగిలిన యాలకులపొడి వేసి కలపాలి. ఇష్టమైతే కాస్త రోజ్‌వాటర్‌ కూడా కలుపుకోవచ్చు. గులాబ్‌జామ్‌ పొడిలో తగినన్ని నీళ్లు పోసి కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పిండి ఉండను చిన్న పూరీలా చేసుకుని అందులో క్యారెట్‌ మిశ్రమంతో చేసిన ఉండను పెట్టి అంచులు కలిపేయాలి. వీటిని కాగిన నెయ్యిలో ముదురు రంగు వచ్చేవరకూ వేయించి తీసి, పంచదార పాకంలో వేయాలి.

ఇదీ చదవండి:పసిడితో ప్రత్యేక 'స్వీట్లు'- ధరెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details