హల్వాల్లో బాంబే కరాచీ హల్వా రుచే వేరు. పసందైన ఈ హల్వాను సింపుల్‌గా చేసుకొని ఆస్వాదించాలనుందా? అయితే.. ఇలా ట్రై చేయండి.
కావాల్సినవి:
- మొక్కజొన్నపిండి- అరకప్పు
- నీళ్లు- రెండున్నర కప్పులు
- నిమ్మరసం- చెంచా
- నెయ్యి- నాలుగు చెంచాలు
- పంచదార- ఒకటింపావుకప్పు
- నిమ్మరసం- చెంచా
- నెయ్యి- నాలుగుచెంచాలు
- జీడిపప్పులు- పది
- యాలకులపొడి- పావుచెంచా
- ఫుడ్ కలర్- కొద్దిగా
- బాదం పప్పులు- ఐదు
తయారీ విధానం:
వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో కప్పున్నర నీళ్లు పోసి ఉండల్లేకుండా కార్న్‌ఫ్లోర్‌ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్‌స్టిక్ పాత్రను తీసుకుని అందులో కప్పునీళ్లు పోసి పంచదార వేసి సన్నని సెగ మీద కరిగించుకొని కొద్దిగా మరిగేంతవరకూ ఆగాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి సన్నటి సెగమీద గరిటెతో కలుపుతూ దగ్గరగా వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత చెంచా నెయ్యి వేసి.. అది మిశ్రమంలో ఇంకిపోయేవరకు గరిటెతో కలుపుకోవాలి.
అలాగే మరికొద్ది నెయ్యి, నిమ్మరసం వేసి కలుపుతూ ఉంటే మిశ్రమం కాసేపటికి పారదర్శకంగా మారుతుంది. అప్పటికి కొద్దికొద్దిగా నెయ్యి బయటకు వస్తుంది. అప్పుడే ఫుడ్‌కలర్, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసుకుని మరొక్కసారి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈమిశ్రమాన్ని ట్రే లాంటి వెడల్పాటి పాత్రలోకి తీసుకుని గంట తర్వాత బాదం పప్పులు చల్లుకుని ముక్కలుగా కోసుకుంటే సరి.
ఇదీ చదవండి:పసందైన 'కొబ్బరి బర్ఫీ'ని ఆస్వాదించండిలా..