తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఉప్మా రుచిగా రావాలంటే ఏం చేయాలంటే? - ఉప్మా తయారీ

ఉప్మా చేసినప్పుడల్లా పిల్లలు అస్సలు తినడం లేదు. ఎన్ని రకాలుగా చేసినా నచ్చలేదంటారు. దీన్ని రుచికరంగా, చిన్నారులు మెచ్చేలా ఎలా చేయాలి? అని చాలామంది ఆలోచిస్తుంటారు. వారికోసమే ఈ స్టోరీ.

upma
ఉప్మా, ఉప్మా తయారీ

By

Published : Jul 31, 2021, 7:02 AM IST

ఉప్మా రుచిగా రావాలంటే నాణ్యమైన ఉప్మారవ్వను ఎంచుకోవాలి.

తయారు చేసే విధానం:

  • రవ్వను ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇలా చేస్తే కమ్మటి వాసనతోపాటు ఉప్మా ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది.
  • నూనెతో కాకుండా ఆవు నెయ్యితో చేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ వస్తాయి.
  • ఈ అల్పాహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా వేయకూడదు. అసలు వేయకుండా చేసిన ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.
  • దీని తయారీకి వాడే కడాయి/గిన్నె అడుగు భాగం చాలా మందంగా ఉండాలి. పలుచగా ఉంటే త్వరగా అడుగంటుతుంది.
  • మరిగే నీళ్లలో కొద్దికొద్దిగా రవ్వ పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
  • పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇందులో జీడిపప్పు, వేరుసెనగపప్పులు వేసుకోవాలి. బీన్స్‌, క్యారెట్‌, పనీర్‌, కొత్తిమీరా, బఠానీలను తాలింపులో వేస్తే రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
  • ఈ టిఫిన్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. టేస్ట్‌ పెరగడానికి నీళ్లలో ఉప్పుతోపాటు కాస్తంత పంచదార కూడా కలుపుతుంటారు కొందరు. సన్నగా తురిమిన అల్లం ముక్కలను వేసుకుంటే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
  • పల్లీలను ముందుగా నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా అంతా తయారైన తర్వాత చివరగా వేసుకుంటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
  • చిన్నారులు ఉప్మాను ఇష్టపడాలంటే ఉప్మా తయారైన తర్వాత కాజూ, పల్లీలు, సేవ్‌, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి పెడితే ఇష్టంగా తింటారు.
  • వడ్డించడానికి ముందు చెంచా నిమ్మరసం కలిపితే మరింత రుచి పెరుగుతుంది. అలాగే చెంచా నెయ్యిని కూడా జోడిస్తే అదనపు రుచి మీ సొంతమవుతుంది.

ఇదీ చూడండి:నూడుల్స్‌ పొడిపొడిగా రావాలంటే!

ABOUT THE AUTHOR

...view details