గుడ్డులో విటమిన్-డి, జింక్, సెలీనియమ్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన ఎగ్స్ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కానీ, రోజూ ఉడకబెట్టిన గుడ్డు తింటే బోరు కదా.. అలా అని గిన్నెడు నూనెలో వేసి వెరైటీలు చేస్తే.. పోషకాలన్నీ మాయమవుతాయి. మరి గుడ్డులో పోషకాలను మరింత పెంచే స్టఫ్డ్ ఎగ్ రెసిపీ ఇలా సింపుల్గా చేసుకోండి...
టేస్టీ 'స్టప్డ్ ఎగ్..' నూనె లేకుండా సింపుల్ చేసుకోండిలా! కావాల్సినవి ఇవే..
- ఉడికించిన గుడ్లు- 4
- ఉడికించిన బంగాళదుంప తురుము-ఒక కప్పు
- మయోనీజ్-1 టేబుల్ స్పూన్
- ఉప్పు-రుచికి తగినంత
- కొత్తిమీర తరుగు-2 టీ స్పూన్లు
- మిరియాల పొడి-1 టీ స్పూన్
- ఊరగాయ కారం- 1 టీస్పూన్
తయారీ ఇలా..
ఉడికించిన గుడ్లను నిలువుగా రెండు ముక్కలు చేసుకొని.. అందులోనే పచ్చసొనను తీసి పెట్టుకోవాలి. ఓ బౌల్లో బంగాళదుంప తురుము వేసి అందులో ముందుగా తీసిపెట్టుకున్న పచ్చసొన వేసి మెదుపుకోవాలి. తర్వాత, మయోనీజ్, ఉప్పు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఊరగాయ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు.. ఈ మిశ్రమాన్ని గుడ్డు తెల్లసొనలోని ఖాలీ గుంటలో స్టఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్టఫ్డ్ ఎగ్స్ రెడీ. మరి మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్తో పంచుకుంటారు కదూ...!
ఇదీ చదవండి:'గోరుచిక్కుడు'తో నయా రెసిపీ ట్రై చేయండిలా