తెలంగాణ

telangana

ETV Bharat / priya

'పైనాపిల్​ స్మూతీ'తో అధిక వేడి నుంచి క్షణాల్లో ఉపశమనం!

చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరిలోనూ సాధారణంగా కనిపించే సమస్య శరీరంలో వేడి పెరగడం. వేసవి వచ్చిందంటే ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అయితే 'పైనాపిల్​ స్మూతీ' తాగినట్లయితే ఒంట్లో అధిక వేడి క్షణాల్లో తగ్గి ఉపశమనం పొందవచ్చు. అదెలా తయారుచేయాలో ఓ సారి చూద్దాం.

Pineapple and orange smoothie
'పైనాపిల్​ స్మూతీ'తో అధిక వేడి నుంచి తక్షణ ఉపశమనం!

By

Published : Jun 10, 2020, 1:11 PM IST

ప్రతి మనిషి శరీరంలో వేడి ఉంటుంది. అయితే అది సమతుల్యంగా ఉన్నంతవరకు ఎలాంటి సమస్య ఉండదు. అదే వేడి కాస్త ఎక్కువ అయిందంటే చాలు చిరాకు, చర్మంపై మొటిమలు రావడం, చెమట కురుపులు, జలుబు ఇలా శరీరతత్వాల ఆధారంగా పలు సమస్యలు వస్తాయి. అయితే 'పైనాపిల్ స్మూతీ' తీసుకుంటే శరీరంలో అధిక వేడి నుంచి సులభంగా బయటపడవచ్చు. దాన్ని తయారు చేసే విధానం మీకోసం..

కావాల్సిన పదార్థాలు..

పైనాపిల్​-1, పైనాపిల్​ జ్యూస్​-125 మిల్లీలీటర్లు, పైనాపిల్​ క్యూబ్స్​-100 గ్రాములు, పెరుగు-175 మిల్లీ లీటర్లు, నారింజ జ్యూస్​-125 మిల్లీ లీటర్లు, ఐస్​ ముక్కలు- తగినన్ని, చక్కెర-3 టేబుల్​ స్పూన్​లు​.

తయారు చేయడం ఇలా..

ఓ పైనాపిల్​ను తీసుకొని ముందుగా తొక్క తీయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వాటిలో కొన్నింటితో జ్యూస్​ తీసుకోవాలి. తర్వాత పైన చెప్పిన మోతాదులో అన్ని పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. వాటన్నింటిని మిక్సీలో వేసి జ్యూస్​​ తయారు చేసుకోవాలి. అంతే పైనాపిల్​ స్మూతీ రెడీ. పైనాపిల్​కు బదులు ఏ పండ్లతో అయినా ఈ రకమైన జ్యూస్​ను​ తయారు చేసుకోవచ్చు. మీరు చూశారుగా.. ఇక ఇంట్లో తయారు చేసి మీ అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకోండి.

'పైనాపిల్​ స్మూతీ'తో అధిక వేడి నుంచి తక్షణ ఉపశమనం!

ఇదీ చూడండి:బావిలో పడిన చిరుతపులి.. ఇలా బయటపడింది

ABOUT THE AUTHOR

...view details