తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇంట్లోనే వేడి వేడి బ్రెడ్ పిజా చేసుకోండిలా - బ్రెడ్ పిజా ఎలా తయారు చేసుకోవాలి

అసలే వర్షాకాలం. కొద్దిరోజులుగా వరుణుడు సైతం శాంతించడం లేదు. ఇలాంటి సమయంలో సాయంత్రం వేళ నోటికి కాస్త రుచి తగలకపోతే అస్సలు బాగోదు. బయటికెళ్లి తిందామంటే ఓ వైపు వర్షం, మరోవైపు కరోనా భయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే రుచికరమైన బ్రెడ్ పిజా తయారు చేసుకుంటే! ఆలోచన సరే.. చేసుకోవడం ఎలా అంటారా? మరి కథనంలోకి ప్రవేశించండి.

for food
ఇంట్లోనే వేడి వేడి బ్రెడ్ పిజా చేసుకోండిలా

By

Published : Aug 20, 2020, 1:01 PM IST

కరోనా భయాలతో ఇంట్లోనే హోటల్ రుచులను ప్రయత్నిస్తున్నారా? అయితే ఓసారి బ్రెడ్ పిజానూ ప్రయత్నించి చూడండి. ఎంతో సులభంగా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు.

ఇంట్లోనే వేడి వేడి బ్రెడ్ పిజా చేసుకోండిలా

కావల్సినవి:

బ్రెడ్‌ స్లైసులు - ఆరేడు, ఉప్పు కలపని వెన్న - రెండు చెంచాలు, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికం - ఒక్కోటి చొప్పున, చీజ్‌ తురుము - అరకప్పు, టొమాటో కెచెప్‌ లేదా పిజా సాస్‌ - పావుకప్పు, ఉప్పు, మిరియాలపొడి - తగినంత.

తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికంలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్‌ స్లైసు తీసుకుని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచెప్‌ లేదా పిజా సాస్‌ని టాపింగ్‌లా రాయాలి. పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. దానిపైన తగినంత చీజ్‌ని పరవాలి. ఇలా మిగిలిన స్లైసులను కూడా చేసుకోవాలి. వీటన్నింటినీ ఓవెన్‌లో ఉంచి మూడు నాలుగు నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది. పైన కావాలనుకుంటే మరికాస్త మిరియాలపొడి చల్లుకోవచ్చు. ఈ పిజాలు వేడివేడిగా తింటేనే బాగుంటాయి.

ABOUT THE AUTHOR

...view details