టీ లేదా ఛాయ్‌ని భారతీయులు అమితంగా ఇష్టపడతారు. అంతేకాదు దేశ సంస్కృతిలో ఛాయ్ ఓ భాగమని భావిస్తారు. అందుకే ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే మొట్టమొదట 'టీ తాగుతారా?' అని అడుగుతారు. ఇటీవల 'టీ బోర్డు ఆఫ్ ఇండియా(టీబీఐ)' చేసిన సర్వేలో ఇప్పటికీ 80 శాతం మంది పాలతో తయారు చేసిన 'ఛాయ్' నే తాగుతున్నారని తేలింది. అయితే ఎప్పుడూ ఒకేలా టీ తయారు చేయడమేనా! కాస్త కొత్తగా 'మసాలా ఛాయ్' ట్రై చేసి సాయంత్రం స్నాక్స్ సమయంలో ఆస్వాదించండి. మీ మెదడును మరింత ఉల్లాసంగా ఉంచుకోండి.
కావాల్సిన పదార్థాలు
యాలికలు-2 లేదా 3,
మిరియాలు-10 నుంచి 12,
లవంగాలు-2 లేదా 3,
దాల్చిన చెక్క- ఒక ఇంచు,
అల్లం-తగినంత,
నీళ్లు- 2 కప్పులు,
పుదీన ఆకులు-3 లేదా 4,
టీ పొడి-1 నుంచి 2 టీస్పూన్,
పాలు-1 కప్పు,
చక్కెర- 2నుంచి 3 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం..
యాలికలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చెయ్యాలి. ఓ పాత్రలో రెండు కప్పుల నీళ్లు, పుదీన ఆకులు, తరిగిన అల్లం 1 టీస్పూన్, పొడిచేసిన మసాలా దినుసులు-1 టీ స్పూన్, టీ పొడి, ఓ కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేసి బాగా మరిగించాలి. దాన్ని ఓ కప్పులో వడకట్టి.. కావలసినంత చక్కెర వేసుకోవాలి. అంతే మసాలా టీ రెడీ. మీరూ తయారు చేసి మీ అభిప్రాయాలను ఈటీవీ భారత్‌తో పంచుకోండి.
మసాలా ఛాయ్‌ను తయారు చేయండి ఇలా ఇదీ చూడండి:మరోసారి బిగ్‌బీ ఉదారత.. ఏం చేశారంటే?