సాయంత్రమైతే చాలు ఆఫీసు, పాఠశాలలు ముగించుకుని సహొద్యోగులు, స్నేహితులతో కలిసి వీధి బండ్ల వద్ద దొరికే న్యూడిల్స్, చాట్, పానీపూరీ వంటి చిరుతిండ్లను ఆరగించేసే వాళ్లం. కానీ ఇదంతా కరోనా రాక ముందు. ఒక్కసారిగా కరోనా రాకతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి భయాలతో కాస్త కష్టమైనా సరే ఈ అలవాట్లకు కొద్దికాలం చెక్ పెట్టక తప్పలేదు. అయితేనేం.. మీకు ఇష్టమైన చిరుతిండ్లను ఇంట్లోనే ఉంటూ తయారు చేసుకోవచ్చు. దేశ రాజధానిలో అత్యంత ఆదరణ పొందిన చిరుతిండ్లలో ఒకటి 'కచాలు చాట్'. దీనిని హిందీలో కచాలు లేదా ఆర్బీ అని అంటారు. మీ ఇంట్లోనే సులువుగా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు..
- చేమగడ్డ-250గ్రాములు
- ఉప్పు, జీలకర్రపొడి-తగినంత
- గరం మసాల-పావు టీస్పూన్
- బ్లాక్‌సాల్ట్-తగినంత
- చాట్‌మసాల-రెండు టీస్పూన్లు
- కారం-ఒక టీస్పూన్
- నిమ్మరసం-రెండు టీస్పూన్లు
- గ్రీన్ చెట్నీ, చింతపండు, కర్జూరం చట్నీ, సేవ్ కొత్తిమీర, దానిమ్మ గింజలు.